విమానం టాయిలెట్ లో పిండం…!

A Fetus found in lavatory of Flight

న్యూఢిల్లీ: విమానం టాయిలెట్ లో పిండం పడి ఉన్న విషయాన్ని గుర్తించిన విమాన సిబ్బంది వెంటనే ఆ విషయమై విమానంలోని ప్రయాణికులను వాకాబు చేశారు. దీంతో అది తనదేనని 19 ఏళ్ల తైక్వాండో క్రీడాకారిణి అంగీకరించింది. గర్భస్రావం వల్ల మృతశిశువు పడిపోయిందని ఆమె వివరించినట్లు తెలిసింది. గౌహతి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏషియా విమానంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయినా తరువాత ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పిండం వయసు నిర్ధారించేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, సదరు తైక్వాండో ప్లేయర్ శుక్రవారం తన కోచ్‌తో కలిసి దక్షిణ కొరియా వెళ్లాల్సి ఉందని సమాచారం.