విమానంలో 6.6 కిలోల బంగారం పట్టివేత

Bangalore : 6.6 Kg of gold Seized in Flightబెంగళూరు : విమానం టాయిలెట్‌లో దాచిన 6.6 కిలోల బంగారాన్ని డిఆర్‌ఐ అధికారులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన విమానంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారం రావడంతో డిఆర్‌ఐ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో విమానం టాయిలెట్‌లో దాచిన 6.6కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. పట్టుబడిన ఈ బంగారం విలువ మార్కెట్లో 2 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ బంగారాన్ని ఎవరు తరలిస్తున్నారన్న దానిపై విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

6.6 Kg of gold Seized in Flight at Bangalore

Comments

comments