విబిఐటికి జాతీయ బోర్డు గుర్తింపు

Vignana Bharti Engineering College is A grade in NAAC

ఘట్‌కేసర్ : ఘట్‌కేసర్ మండలంలోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలకు న్యాక్ లో ఏ గ్రేడ్ రావడంతో చైర్మన్ గౌతంరావు హర్షం వ్యక్తం చేశారు. ఘట్‌కేసర్ మండల పరిధిలోని అవుషాపూర్ విబిఐటి కళాశాలకు న్యాక్ (NAAC) లో ‘ఎ’ గ్రేడ్ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌతంరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 88 కళాశాలలకు గాను ఏడు ఎంపిక చేయగా అందులో, వీబీఐటి ‘ఎ’ గ్రేడ్ సాధించినట్లు తెలిపారు. గత 14 సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అందువల్ల సి.ఎస్.ఈ, ఈ.సి.ఈ, ఈ.ఈ.ఈ, ఐ.టి, సివిల్ కు ఎన్.బి.ఎ గుర్తింపు లభించినట్లు వెల్లడించారు. విద్యార్థుల అభివృద్ధికి అద్యాపకుల కృషి, విద్యార్థుల క్రమ శిక్షణ వల్ల ఈ ఘనతా సాధించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మనోహర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ అమరేందర్‌రావు, వైస్ ప్రిన్సిపాల్ జయంత్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.