విధులకు సాంకేతికతను అన్వయించాలి : ఎస్పీ కల్మేశ్వర్ సింగనే వార్

Techniques should be applied for duty: SP

మనతెలంగాణ /ఆసిఫాబాద్‌టౌన్ : పోలీసింగ్‌లో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా మన యొక్క విధులకు సాంకేతికతను అన్వయించి నవికరణ చేసు కోవాలని జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగనే వార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని స్థానిక పోలీసుల ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా కుమ్రంభీం జిల్లాలో మూడు నుంచి ఐదు సంవ త్సరాలు పూర్తి చేసుకున్న ఎనిమిది మంది ఎఎస్‌ఐలు, తొమ్మిది మంది హెడ్ కాని స్టేబుళ్ళకు, ఇతర జిల్లాలైన మంచిర్యాల నుంచి ఇద్దరు ఎఎస్‌ఐలు, హెడ్‌కాని స్టేబుళ్ళు ముగ్గురు, ఆదిలాబాద్ నుంచి ఎఎస్‌ఐలు నలుగురు, హెడ్‌కానిస్టేబుళ్ళ ఐదుగురు, నిర్మల్ జిల్లా నుంచి వచ్చిన ఎఎస్‌ఐ ఒక్కరు, హెడ్‌కానిస్టేబుళ్ళు ఇద్దరు మొత్తం 16మంది ఎఎస్‌ఐలకు , 19మంది హెడ్ కానిస్టేబుళ్ళకు వారి సీనియర్టీ ,ఐచ్చికలకు అనుగుణంగాకౌన్సిలింగ్ నిర్వహించివారికి పోస్టులు కేటా యించా రు. అనంతరం నూతనంగా బదిలి అయిన సిబ్బందితో జిల్లా ఎస్పీ మాట్లా డుతూ పోలిసింగ్‌లో ఆధుని కమై అధునతన వ్యవస్థలను ప్రజలకు చేరువ య్యేలా రాష్ట్ర డీజీపీ నూతనమైన అనేక మార్పులను తీసుకువస్తున్నారన్నారు. అలాంటి వ్యవస్థను అతలింపు చేసుకు నేందుకు మనం మన పూర్తి సామర్దాన్ని కలిగి ఉంటూ నైపుణ్యాన్ని నిరంతరం పెంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గోద్రు, డిఎస్పీ సత్యనారాయణ, ఐటికోర్ ఇన్స్‌పెక్టర్ స్వామి, సీఐలు బాలాజీ వరప్రసాద్, పురుషోత్తమచారి, అడ్మిస్ట్రేషన్ అధికారి భక్త ప్రహ్లద్, డిపిఓ సూపరింటెండెంట్ పి. సతీష్ కుమార్, ఆర్‌ఐ అడ్మిన్ శేఖర్‌బాబు, పోలీసు అసోసియేషన్ ప్రసిడెంట్ శ్రీరాములు, ఇతర పోలీసు ఇబ్బంది పాల్గొన్నారు.

Comments

comments