విద్యుదాఘాతంతో తల్లీకొడుకు మృతి

భద్రాద్రి కొత్తగూడెం: విద్యుదాఘాతంతో తల్లీకొడుకు మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సింగరేణి ప్రాంతంలోని రుద్రపూర్ సింగరేణీ క్వార్టర్స్‌లో జరిగింది. ప్రమాదవశాత్తు తల్లితో పాటు కుమారుడు కూడా విద్యుత్ షాక్‌కు గురికావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: