విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి…

సూర్యాపేట: ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తో వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని కిందితండా గ్రామపంచాయితీలో మంగళవారం చోటు చేసుకుంది. స్ధానికులు,బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన పిల్లుట్ల వీరాస్వామి(40) వృత్తి రీత్యా టెంట్‌హౌజ్ నడుపుతున్నాడు. వృత్తిలో భాగంగా శనివారం కిందితండాలో వివాహం నిమిత్తం గుడారం టెంట్ వేయగా గత 3రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్‌ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన వద్ద సహాయకుడిగా ఉన్న మేకల చెన్నకేశవులకు […]

సూర్యాపేట: ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తో వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని కిందితండా గ్రామపంచాయితీలో మంగళవారం చోటు చేసుకుంది. స్ధానికులు,బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన పిల్లుట్ల వీరాస్వామి(40) వృత్తి రీత్యా టెంట్‌హౌజ్ నడుపుతున్నాడు. వృత్తిలో భాగంగా శనివారం కిందితండాలో వివాహం నిమిత్తం గుడారం టెంట్ వేయగా గత 3రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్‌ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన వద్ద సహాయకుడిగా ఉన్న మేకల చెన్నకేశవులకు తీవ్ర గాయాలు కాగా పరిస్ధితి విషమంగా ఉండడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడికి  భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని,మృతుని కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments

Related Stories: