విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి

కమలాపూర్‌ః బట్టలు ఆరేస్తున్న దండానికి విద్యుత్ ప్రసరించడంతో ఓ వివాహిత విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని దేశరాజ్‌పల్లిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన కుటుంబ సభ్యుల్లో కన్నీరు నింపగా గ్రామస్తులను కలచి వేసింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని దేశరాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి మానస (22) అనే వివాహిత శుక్రవారం తమ కుటుంబ సభ్యుల దుస్తులను పిండి వాటిని ఆర బెట్టేందుకు ఎప్పటిలాగే దండెంపై వేసింది. అయితే అప్పటికే ఆ […]

కమలాపూర్‌ః బట్టలు ఆరేస్తున్న దండానికి విద్యుత్ ప్రసరించడంతో ఓ వివాహిత విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని దేశరాజ్‌పల్లిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన కుటుంబ సభ్యుల్లో కన్నీరు నింపగా గ్రామస్తులను కలచి వేసింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని దేశరాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి మానస (22) అనే వివాహిత శుక్రవారం తమ కుటుంబ సభ్యుల దుస్తులను పిండి వాటిని ఆర బెట్టేందుకు ఎప్పటిలాగే దండెంపై వేసింది. అయితే అప్పటికే ఆ దండానికి ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరిస్తోంది. ఇది గమనించకపోవడంతో మానస తడి బట్టలను ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దండానికి ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరించడం కారణంగా మానస మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. మృతురాలికి భర్త ప్రదీప్‌తో పాటు ఐదు నెలల బాలుడు ఉన్నాడు. సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

Comments

comments

Related Stories: