విద్యుత్ షాక్‌తో రైతు మృతి…

నిడమనూరు: విద్యుత్ షాక్‌తో రైతు సింగం పరమేశ్ (38)మృతి చెందగా,ఇద్దరికి సింగం నాగరాజు,సింగం వెంకన్నలకు తీవ్ర గాయాలైన ఘటన నిడమనూరు మండలం నందికోండవారిగూడెం గ్రామంలోని వంగాలవారి గూడెంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిడమనూరు మండలం వంగాలవారిగూడెం (గ్రామం) మండల రైతు సమన్వయ సమితి సభ్యులు సింగం పరమేశ్ గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమిలో బోరుబావి వద్ద ముగ్గురు కలిసి విద్యుత్ ట్రాన్స్‌ ఫార్మర్ (మోటర్‌లకు సరఫరా కాకుండా) ఆఫ్ చేసి ఎల్‌టి […]

నిడమనూరు: విద్యుత్ షాక్‌తో రైతు సింగం పరమేశ్ (38)మృతి చెందగా,ఇద్దరికి సింగం నాగరాజు,సింగం వెంకన్నలకు తీవ్ర గాయాలైన ఘటన నిడమనూరు మండలం నందికోండవారిగూడెం గ్రామంలోని వంగాలవారి గూడెంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిడమనూరు మండలం వంగాలవారిగూడెం (గ్రామం) మండల రైతు సమన్వయ సమితి సభ్యులు సింగం పరమేశ్ గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమిలో బోరుబావి వద్ద ముగ్గురు కలిసి విద్యుత్ ట్రాన్స్‌ ఫార్మర్ (మోటర్‌లకు సరఫరా కాకుండా) ఆఫ్ చేసి ఎల్‌టి లైన్ తీగలు మరమ్మతులు చేస్తుండగా ఒకేసారి ఎల్‌టి లైన్ తీగలపై 33/11 కేవి విద్యుత్ తీగలు పడడంతో ఒకసారిగా ఎల్‌టి లైన్‌కి విద్యుత్ సరఫరా కావడంతో మొదట సింగం నాగరాజు, సింగం వెంకన్నలకు షాక్ గురై వీరు తీవ్ర గాయ్యలైయి, సింగం పరమేశ్ కూడ షాక్ కు గురి కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సింగం పరమేష్ ప్రస్తుతం టిఆర్‌ఎస్ పార్టీలో కార్యకర్తలకు అండగా ఉంటు, మండల రైతు సమన్వయ సమితి సభ్యులుగా పని చేస్తున్నాడు. మండల రైతు సమన్వయ సమితి సభ్యులు సింగం పరమేశ్ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే టిఆర్‌ఎస్ పార్టీ నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇంచార్జీ నోముల నర్సింహ్మయ్య యాదవ్ సంఘటన స్ధలానికి చేరుకుని గ్రామస్ధులను ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు, అదేవిధంగా సింగం పరమేశ్ మృతి పట్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతు టిఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటు అన్నారు. వంగాలవారిగూడెంలో విషాదఛాయలు అమలుకున్నాయి. మృతుడి కుమారై, కుమారుడు ‘నాన్న…లే నాన్న’ అంటుడంతో గ్రామస్ధులందరు కనీటి పర్వమైంది.  అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  మృతుడి భార్య సింగం సుజాత పిర్యాధు మేరకు ఎస్‌ఐ యాదయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Comments

comments

Related Stories: