విద్యుత్ షాక్‌తో రైతు మృతి…

నిర్మల్:  జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో విద్యుదాఘతంతో శనివారం ఓ రైతు మృత్యువాతపడ్డాడు.  స్థానిక ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం… మండల కేంద్రానికి చెందిన సాంబశివరావుకు గ్రామ పరిథిలోనే వరి పొలం ఉంది. కొంతభాగం కోత దశలో ఉండగా, మిగితా కొంత పొలానికి నీరు అవసరం అయింది. కాగా విద్యుత్‌ పంపును స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. అది స్టార్ట్ కాలేదు తన పొలంగట్టుపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పరీక్షించగా, ఫ్యూజ్ పోయినట్లు గుర్తించాడు. విద్యుత్ సరఫరా లేదని భావించిన […]

నిర్మల్:  జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో విద్యుదాఘతంతో శనివారం ఓ రైతు మృత్యువాతపడ్డాడు.  స్థానిక ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం… మండల కేంద్రానికి చెందిన సాంబశివరావుకు గ్రామ పరిథిలోనే వరి పొలం ఉంది. కొంతభాగం కోత దశలో ఉండగా, మిగితా కొంత పొలానికి నీరు అవసరం అయింది. కాగా విద్యుత్‌ పంపును స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. అది స్టార్ట్ కాలేదు తన పొలంగట్టుపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పరీక్షించగా, ఫ్యూజ్ పోయినట్లు గుర్తించాడు. విద్యుత్ సరఫరా లేదని భావించిన ఆయన విద్యుత్‌శాఖ సిబ్బందికి ఎటువంటి సమాచారం తెలపకుండానే ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఫ్యూజ్ వేయడానికి యత్నించడంతో విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులతోపాటు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైతు మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, కేసును పలు కోణాల్లో విచారణ చేయనున్నట్టు ఎస్సై పేర్కొన్నాడు.

Comments

comments

Related Stories: