విద్యుత్ కాంతుల ధగధగలు

ఎల్‌ఇడి లైట్లను పూర్తి స్థాయిలో అమర్చిన అతిపెద్ద కార్పొరేషన్‌గా బల్దియా 855 శాతం విద్యుత్ ఆదా రూ.48.70 కోట్ల బిల్లులు ఆదా మన తెలంగాణ/సిటీబ్యూరో ఎల్.ఇ.డి లైట్లను పూర్తి స్థా యిలో అమర్చిన అతిపెద్ద నగరంగా మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్ట్‌ను జిహెచ్‌ఎంసి అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, విజయవంతంగా పూర్తి చేశారు. నగరమంతా ఎల్. ఇ.డి లైట్లతో వెలిగిపోతోంది. ఈ ప్రాజెక్ట్‌ను రూ.271.40 కోట్లతో చేపట్టారు. నగరంలోని 4.53 లక్షల […]

ఎల్‌ఇడి లైట్లను పూర్తి స్థాయిలో అమర్చిన అతిపెద్ద కార్పొరేషన్‌గా బల్దియా
855 శాతం విద్యుత్ ఆదా రూ.48.70 కోట్ల బిల్లులు ఆదా

మన తెలంగాణ/సిటీబ్యూరో
ఎల్.ఇ.డి లైట్లను పూర్తి స్థా యిలో అమర్చిన అతిపెద్ద నగరంగా మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్ట్‌ను జిహెచ్‌ఎంసి అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, విజయవంతంగా పూర్తి చేశారు. నగరమంతా ఎల్. ఇ.డి లైట్లతో వెలిగిపోతోంది. ఈ ప్రాజెక్ట్‌ను రూ.271.40 కోట్లతో చేపట్టారు. నగరంలోని 4.53 లక్షల సంప్రదాయ లైట్లస్థానంలో ఎల్‌ఇడి లైట్లను అమర్చే ప్రక్రియను జిహెచ్‌ఎంసి అధికారులు 2017 జూలైలో చేపట్టారు. డిసెంబర్‌లో పూర్తి చేయాలని లక్షంగా నిర్థేశించుకోగా, అనుకున్న విధంగా ప్రధాన మార్గాలన్నింటిలో ఎల్‌ఇడి లైట్లు ఏర్పాటు చేశారు. జూన్ 2018 నాటికి 4.05 లక్షల లైట్లను అమర్చారు. కేంద్ర విద్యుత్ శాఖ అనుబంధ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టగా, మే 25.2018 నాటికి 90 శాతానికిపైగా లైట్లను బింగించారు. 40,7,392 లైట్లను ఎల్‌ఇడి లైట్లుగా మార్చడం ద్వారా దేశంలోనే ఎల్‌ఇడి లైట్ ప్రాజెక్ట్‌ను చేపట్టిన అతిపెద్ద కార్పొరేషన్‌గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిలిచింది.
ఆటోమెటిక్‌గా ఎల్‌ఇడి లైట్ల నిర్వహణ…
వీధి దీపాలు వెలుగుతున్నాయా?… విద్యుత్ వినియోగం ఎంత అవుతుంది. జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న మొత్తం స్ట్రీట్ లైట్లలో ఎన్ని వెలుగుతున్నాయి? తదితర వివరాలు తెలుసుకోవాలంటే //120.138.9.117:8080/ghmc అనే వెబ్‌సైట్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో ఎల్‌ఇడి లైట్లను రికార్డు స్థాఁధలో మార్పిడి చేయడం ద్వారా దేశంలోనే రికార్డు సృష్టించిన జిహెచ్‌ఎంసి వీధి దీపాల నిర్వహణను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోంది. స్మార్ట్ ఫోన్ ద్వారా సిటీలో అన్ని లైట్లు వెలుగుతున్నాయి. ఎన్ని వెలగడం లేదు, ఏ ప్రాంతంలో వెలగడం లేదు తదితర సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకునే పాదర్శక విదానాన్ని దేశంలోనే జిహెచ్‌ఎంసి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న ఎల్‌ఇడి లైట్లలో 4,06,729 స్ట్రీట్ లైట్లను 24,800 సెంట్రలైజ్‌డ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టం(సీసీఎంఎస్) డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఎన్ని లైట్లు, ఎంత శాతం లైట్లు వెలుగుతున్నాయి అనే సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎల్‌ఇడి లైట్లకు సంబంధించిన ఫిర్యాదులను టోల్‌ఫ్రీ నెంబర్ 18001803580 ఫోన్ చేయడంతో పాటు ఇ మెయిల్ helpline@eesl.co.in // support.eeslindia.org అనే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
రికార్డు స్థాయిలో రూ.48.70 కోట్ల విద్యుత్ బిల్లుల ఆదా…
సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో ఎల్‌ఇడి లైట్లను మార్పిడి చేయడం ద్వారా జూలై 2017 నుంచి ఏప్రిల్ 2018 వరకు రూ.48.70 కోట్ల విద్యుత్ బిల్లులు ఆదా అయ్యాయి. మొత్తం 6,97,64,511 యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. 2018 ఏప్రిల్ మాసంలో 96 శాతం లైట్లు వెలుగుతూ 55 శాతం విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గగా, 2017 ఏప్రిల్ మాసంలో 80 శాతం లైట్లు వెలిగాయి. వీధి లైట్లను ఎల్‌ఇడి లైట్లుగా మార్పిడి అనంతరం నగరంలో ఉన్న అన్ని జిహెచ్‌ఎంసికి చెందిన ఉద్యాన వనాలు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, శ్మశానవాటికలలో కూడా ఎల్‌ఇడి లైటింగ్ మార్పిడి ప్రక్రియ పురోగతిలో ఉంది. స్ట్రీట్ లైట్లు, ఇతర ప్రాంతాల్లో మొత్తం 4,53,000 విద్యుత్ దీపాల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను అమర్చడం ద్వారా సంవత్సరానికి 162.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోంది. తద్వారా జిహెచ్‌ఎంసికి రూ.115.13 కోట్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది. దీంతో పాటు సంవత్సరానికి 1,29,719 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కూడా తగ్గనుంది. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.217.12 కోట్లతో చేపట్టిన ఈ ఎల్‌ఇడి ప్రాజెక్ట్ ద్వారా 55 శాతం విద్యుత్ ఆదా కానుంది.
ఏడేళ్ల పాటు నిర్వహణా బాధ్యతలు ఈఈఎస్‌ఎల్‌దే…
ఏడేళ్ల పాటు ఎల్‌ఇడి ప్రాజెక్ట్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్‌ఎల్ చేపడుతోంది. విద్యుత్ బిల్లుల ఆదా ద్వారా లభించిన నిధులనే ఈఈఎస్‌ఎల్‌కు జిహెచ్‌ఎంసి చెల్లించనుంది. నేషనల్ లైటింగ్ కోడ్(ఎన్.ఎస్.సి) ప్రకారం ప్రతి వీధులకు సరిపడ విద్యుత్ కాంతి ఉండేలా చూడటం జరుగుతుంది. ఈ మొత్తం 4.60 లక్షల ఎల్‌ఇడి లైట్ల నిర్వహణకు 24,862 కంట్రోల్ స్విచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటోటైమర్ల ఆప్షన్‌తో కూడిన ఈ కంట్రోల్ స్విచ్‌లు ఫొటో సైన్స్ ఆధారంగా చీకటి పడగానే ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. ఎవరైనా అక్రమంగా ఈ స్విచ్‌బోర్డుల ద్వారా వెలిగేలైట్లను ఆపివేయడం, లేదా ఉదయం వేళలో లైట్లను వేసేందుకు ప్రయత్నిస్తే ఆ సమాచారం సంబంధిత విద్యుత్ శాఖ ఏఇ లేదా, డిఇలకు వెంటనే వెళ్లుతుంది. ఈ కంట్రోల్ స్విచ్‌ల బోర్డు డోర్‌ను అక్రమంగా తెరిచినా ఆ సమాచారం కూడా వెంటనే అందుతుంది. అయితే ఈ లైట్లు వెలుగుతున్నాయా లేదా అనేది కమాండ్ కంట్రోల్ ద్వారా నేరుగా చూసి, సమీక్షించే అవకాశాన్ని జిహెచ్‌ఎంసి అధికారులతో పాటు అక్కడి స్థానికులు నేరుగా చూసేందుకు ప్రత్యేక లింక్‌ను కూడా అందిస్తారు.
98 శాతం స్ట్రీట్ లైట్లు వెలిగితేనే చెల్లింపులు…
నగరంలో వీధి దీపాల నిర్వహణ చేపట్టిన ఈఈఎల్‌ఎస్‌కు మొత్తం లైట్లలో 98 శాతం వెలిగితేనే బిల్లులు చెల్లించేందుకు జిహెచ్‌ఎంసి ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవేళ ఒప్పందం ప్రకారం మొత్తం లైట్లు వెలగక పోతే ఈఈఎస్‌ఎల్‌కు జరిమానా కూడా విధించే నిబంధనను కూడా పొందపర్చారు. అయితే దేశంలో మారే ఇతర నగరాల్లో ఎన్ని స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయనే సమీక్షించే వ్యవస్థలేదు. ప్రైస్ వాటర్ కూపర్ అనే సంస్థ స్ట్రీట్ లైట్లపై ఇతర నగరాల్లో అద్యయనం చేయగా, కేవలం 70 నుంచి 80 శాతం మాత్రమే స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయని సర్వేలో స్పష్టమైంది. మొత్తానికి అతిపెద్ద ఎల్‌ఇడి ప్రాజెక్ట్‌ను చేపట్టడంతో పాటు లైట్లు వెలుగుతున్నాయనే సమాచారాన్ని సిటీజన్‌లు తెలుసుకునే వ్యవస్థ సైతం ఏర్పాటు చేయడం ద్వారా జిహెచ్‌ఎంసి దేశంలోనే ఆదర్శంగా నిలించిందని బల్దియా అధికారులు అన్నారు.

Comments

comments

Related Stories: