విద్యుత్ కష్టాలు తీర్చిన కెసిఆర్

Harish-Rao

మన తెలంగాణ/పాపన్నపేట : కరెంటు కష్టాలను తీర్చి రైతాంగాన్ని అన్ని రంగాల్లో ఆధుకొన్న రైతుబాంధవుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అని తెలంగాణ శాసనసభ ఉప సభాపతి ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పాపన్నపేట మండలంలోని కుర్తివాడ గ్రామంలో 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో రైతు వేదిక భవన్‌ను ప్రారంభించారు. ఎల్లాపూర్ గ్రామంలో గ్రంథాలయాన్ని ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు టి. సోములుతో కలిసి ప్రారంభించారు. అనంతరం కుర్తివాడ గ్రామంలో ప్రజలనుద్దేశించి ఉప సభాపతి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగానికి కరెంటు కష్టాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆత్మహత్యలు సైతం వేల సంఖ్యలో జరిగాయాని అలాంటివి పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ రైతాంగంపై ప్రత్యేక శ్రద్ధను చూపి రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకున్న  రైతుబాంధవుడు సీఎం కెసిఆర్ అని ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రా ష్ట్రం ఏర్పడితే అంధకారంలోకి వెలుతుందని ఎన్నో విమర్శలకు చెల్లుచీటు ఇచ్చారని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతులకు ఉచిత విద్యు త్, రుణమాఫీ, ఎకరాకు రూ.4వేలతో రైతుబంధు పథకం పెట్టుబడి, రైతులకు అవసరమైన సాంకేతిక సామాగ్రికి సబ్సిడీలు, రైతు శ్రేయస్సు దృష్య ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రశేఖర్‌రావు దక్కుకుతుందన్నారు. రైతులకు బాసటగా నిలిచిన టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రైతాంగం దీవేనలు ఇవ్వాలని ఆమె రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. ఎంపిపి అధ్యక్షురాలు పవిత్రదుర్గయ్య, ఎంపిపి వైస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ పి. విష్ణువర్ధన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు బుర్ర కిష్ణాగౌడ్, రామాగౌడ్, పాపన్నపేట మార్కెట్‌కమిటీ వైస్ చైర్మేన్ టి.గురుమూర్తిగౌడ్, వ్యవసాయ అధికారి ప్రతాప్‌కుమార్, విద్యుత్ ఎస్‌ఇ, డివిజనల్ ఇం జనీర్, ఎడిఇ రవీందర్‌రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.