విద్యుత్ ఎడి కార్యాలయం మూసివేత…

షాపూర్‌నగర్: మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్నచందంలా తయారు అయింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖ పని తీరు. పైకి హుందాగా కనిపిస్తున్న విద్యుత్ శాఖ కొంత మంది అధికారుల నిర్లక్ష్యం చేత వినియోగదారులకు ఇబ్బందులను గురి చేస్తూంది. పట్టపగలు ప్రజలకు సేవలు అందించాల్సిన విద్యుత్ సర్విస్ సెంటర్ అధికారుల అస్రాధ కారణంతో మూసేసారు. ఇదేమిటని కుత్బుల్లాపూర్ ఏడిని వివరణ కోరగా మా దౌర్భాగ్య సిబ్బంది కొరత అంటూ ఆర్టిజెన్స్ అవుట్‌ […]

షాపూర్‌నగర్: మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్నచందంలా తయారు అయింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖ పని తీరు. పైకి హుందాగా కనిపిస్తున్న విద్యుత్ శాఖ కొంత మంది అధికారుల నిర్లక్ష్యం చేత వినియోగదారులకు ఇబ్బందులను గురి చేస్తూంది. పట్టపగలు ప్రజలకు సేవలు అందించాల్సిన విద్యుత్ సర్విస్ సెంటర్ అధికారుల అస్రాధ కారణంతో మూసేసారు. ఇదేమిటని కుత్బుల్లాపూర్ ఏడిని వివరణ కోరగా మా దౌర్భాగ్య సిబ్బంది కొరత అంటూ ఆర్టిజెన్స్ అవుట్‌ సోర్సింగ్ కార్మికులు ధర్నాలో ఉన్నారు అందుకే కార్యలయం మూసాము అంటు సెలవిచ్చారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజికవర్గంలోని కుత్బుల్లాపూర్ విద్యుత్ ఎడి కార్యాలయంలో సిబ్బంది కోరత తాండవం చేస్తూంది. సిబ్బంది కొరత కారణంగా శుక్రవారం కార్యాలయంలో ఎవరూ లేక పోవడంతో ఫీల్డ్ మీదకు వెళ్లాల్సి ఉండగా ఏడి ప్రేమ్‌కుమర్ కార్యాలయాన్ని మూసివేసి తన విధుల మీద ఫీల్డుకు వెళ్లారు.

ఆ సమయంలో కార్యాలయానికి వచ్చిన విద్యుత్ వినియోగదారులు కార్యాలయం మూసి ఉండటంపై ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ప్రజలకు సేవలు అందించాల్సిన విద్యుత్ అధికారులు కార్యాలయాన్ని మూసి ఉంచడంపై వారి పని తీరుకు అద్దం పడుతుందని వినియోగదారులు మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనే అధికారుల పరిస్దితి ఈ విధంగా ఉంటే ఇక మారుమూల గ్రామాల్లో పరిస్తితి ఏ విధంగా ఉంటుందో అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రజల నుంచి వేలల్లో విద్యుత్ బిల్లులు తీసుకుంటుంన్న విద్యుత్ శాఖ ప్రజలకు కనీసం సౌకర్యాలు అందించడానికి సిటిజన్ సర్విస్ సెంటర్‌లోనైన సరైన సిబ్బందిని ఏర్పాటు చేయలేరా? అంటూ నెలనెలా బిల్లులు కడుతున్న ప్రజలు మండిపడుతున్నారు.ఈ సమస్య పై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వినియోగదారులు విద్యుత్ ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Comments

comments

Related Stories: