విద్యుత్ ఉద్యోగులకు ఆరోగ్య పథకం వర్తింపు : కెసిఆర్

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేసిన విధంగానే ఆరోగ్య పథకం అమలు చేస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. శనివారం ప్రగతిభవన్‌లో విద్యుత్ ఉద్యోగులతో కెసిఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చీకటి మయమవుతుందని కొందరు భయపెట్టారని, అలా భయపెట్టిన వారే నేడు చీకటిలో కలిసిపోయారని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడిన […]

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేసిన విధంగానే ఆరోగ్య పథకం అమలు చేస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. శనివారం ప్రగతిభవన్‌లో విద్యుత్ ఉద్యోగులతో కెసిఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చీకటి మయమవుతుందని కొందరు భయపెట్టారని, అలా భయపెట్టిన వారే నేడు చీకటిలో కలిసిపోయారని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు మాసాల్లోనే మిగులు విద్యుత్‌ను చూపించామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగులకు కెసిఆర్ 35 శాతం వేతన సవరణ ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం కాగానే మిగిలిన విద్యుత్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని ఆయన తెలిపారు.

Health Scheme for Electric Employees : CM KCR

Comments

comments

Related Stories: