విద్యాసంస్థల్లో సిసి కెమెరాలు అవశ్యం

Cc cameras in education institutions

మన తెలంగాణ/కరీంనగర్: విద్యాసంస్థలలో సిసి కెమెరాలను విధిగాఏర్పాటు చేసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అన్నారు. బుధ వారం సాయంత్రం నగరంలోని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ అవ రణలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల అవగాహన సదస్సులో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగ రంలో ని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సిసి కెమెరాలను ఏర్పా టు చేసుకోవాలని సిసి కెమెరాలను ఏర్పాటు చేయని విద్యా సంస్థలపై చర్యలుతీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యా సంస్థ ప్రవేశ ద్వారాలు, బయటికివచ్చేద్వారాల వద్ద తప్పని సరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటూ ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను త్వరలో ప్రారంభంకానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడం జరుగు తుందన్నారు. విద్యార్థుల విషయంలో పాఠశాలల నిర్వా హకులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. మైనర్ విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై వచ్చి నట్లయితే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసు కోవడం జరుగుతుందన్నారు. పాఠశాలల్లో జరిగే ఈవ్ టీజింగ్‌ను నియంత్రించేందుకు సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఒక సందర్భంలో పోలీ సులు అలిసిపోయినా సిసికెమెరాలు అలసిపోకుండా నిరం తరం పనిచేస్తుంటాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా హాక్‌ఐ అప్లికేషన్‌ను ప్రతి విద్యార్థిని డౌన్‌లోడ్ చేసుకు నేలా పాఠశాలల యాజమాన్యాలు చూడాలని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో హాక్‌ఐ అప్లికేషన్ ఎంతగానో ఉప యోగపడుతుందని ఆపదలోఉన్న విద్యార్థినిలు, యువ తులు హాక్‌ఐ అప్లికేషన్‌ను వినియోగించుకోవాలని కరీంన గర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ ఎసిపి పి.వెంకట రమణ, కరీంనగర్ త్రీటౌన్ సిఐ విజయ్‌కుమార్, ట్రస్మా రాష్ట్ర ప్రధా న కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, నాయకుడు చెన్నప్ప పాల్గొన్నారు. ఈసందర్భంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు పలువురు విద్యా సంస్థల యజ మానులు మందుకు వచ్చి తాము ఎన్ని కెమెరాలను ఏర్పాటు చేసుకుంటామనే విషయాన్ని ప్రకటించారు.