విద్యావలంటీర్ల నియామకంకు గ్రీన్‌సిగ్నల్

రంగారెడ్డి:ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే టిఆర్‌టి నిర్వహించిన ఫలితాలు వచ్చి ఉపాధ్యాయులు విధులలో చేరడానికి ఆలస్యం కానుండటంతో విద్యావాలంటీర్లను నియమించి విద్యాభోదనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఉపాధ్యాయ ఖాళీలతో పాటు బదిలీల మూలంగా గ్రామీణ ప్రాంతాల్లోని బడులలో పెద్ద సంఖ్యలో పంతుళ్లు లేకపోవడం మూలంగా విద్యాసంవత్సరం ప్రారంబమై 45 రోజులు దాటిన తరగతులు […]


రంగారెడ్డి:ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే టిఆర్‌టి నిర్వహించిన ఫలితాలు వచ్చి ఉపాధ్యాయులు విధులలో చేరడానికి ఆలస్యం కానుండటంతో విద్యావాలంటీర్లను నియమించి విద్యాభోదనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఉపాధ్యాయ ఖాళీలతో పాటు బదిలీల మూలంగా గ్రామీణ ప్రాంతాల్లోని బడులలో పెద్ద సంఖ్యలో పంతుళ్లు లేకపోవడం మూలంగా విద్యాసంవత్సరం ప్రారంబమై 45 రోజులు దాటిన తరగతులు మాత్రం అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఉపాధ్యాయ బదిలీలను వెబ్ అప్షన్ ద్వారా పారదర్శకంగా నిర్వహించి విజయవంతంగా ముగించిన అధికారులు ఈ నెల 13న విద్యావాలటీర్ల నియామకంకు సంబందించి ఆదేశాలు జారీచేశారు. విద్యా సంవత్సరం ప్రారంబమై ఇప్పటికే 45 రోజులు పూర్తి కావడంతో విద్యావాలంటీర్ల నియామక ప్రక్రియలో ఎక్కువ రోజులు జాప్యం చేయకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈ నెల 16 వరకు స్వీకరించి ఈ నెల 17 మండల విద్యాధికారులు సర్టీఫికేట్‌లను పరిశీలించి 19న మండలాల వారిగా ఎంపిక జాబితాలను రూపొందిస్తారు. ఈ నెల 20 నుంచి విద్యావాలంటీర్లు పాఠశాలల్లో విధుల్లో చేరి విద్యాభోదన చేసేలా చర్యలు చేపడుతున్నారు. విద్యావాలంటీర్లకు గౌరవ వేతనం 12 వేలు ఇస్తుండటంతో ఉన్నత చదువులు చదివిన వారు సైతం దరఖాస్తులు చేసుకుంటున్నారు. టిఆర్‌టి పరీక్షలు రాసిన అభ్యర్దులు అంతా విద్యావాలంటీర్ల కోసం దరఖాస్తులు సమర్పిస్తున్నారని తెలిసింది.
వికారాబాద్ జిల్లాలోనే అత్యధికం….
తెలంగాణలోనే అత్యధిక విద్యావాలంటీర్‌లను వికారాబాద్ జిల్లాలో నియమిస్తున్నారు. జిల్లాలో గత సంవత్సరం 961 విద్యావాలంటీర్లను నియమించిన అధికారులు ప్రస్తుతం 1312 మందిని నియమించడానికి అనుమతులు ఇచ్చారు. ఉపాధ్యాయ బదిలీల మూలంగా వికారాబాద్ జిల్లా నుంచి 1056 మంది ఉపాధ్యాయులు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు బదిలీపై వెళ్లగా అక్కడ నుంచి వికారాబాద్ జిల్లాకు కేవలం రెండు వందల మంది మాత్రమే వచ్చారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 299 ప్రభుత్వ పాఠశాలల్లో బదిలీల అనంతరం ఒక్క ఉపాధ్యాయుడు కూడ లేని దుస్థీతి కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లాలో గత సంవత్సరం 653 విద్యా వాలంటీర్లను నియమించగా ప్రస్తుతం 528 నియామకంకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో సైతం గత సంవత్సరం 202 మంది అవసరం పడగా ప్రస్తుతం 107 మందిని నియమించడానికి అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీలలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని శివారు ఖాళీలు పూర్తిగా భర్తీ కావడంతో విద్యావాలంటీర్ల అవసరం చాలా తక్కువ వచ్చింది. విద్యావాలంటీర్లను నియమించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు మరింత తొడ్పాటు అందచేయవలసిన అవసరం చాలా వరకు ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడానికి విద్యాశాఖ అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆయా మండలాలు, గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో బడుల్లోకి వెళ్లి రావాలని దీని వలన మంచి ఫలితాలు వస్తాయని పలువురు పెర్కొంటున్నారు.

Related Stories: