విద్యార్థి ఆధార్ నమోదు ప్రారంభం

Aadhaar registration is the first student in the district
వెల్గటూర్ : చైల్డ్ ఇన్‌ఫోలో ఆధార్ తో అనుసంధానం కాని విద్యార్థులకై ఏర్పాటు చేసిన ఆధార్ నమోదును జిల్లాలో మొట్ట మొదటిగా వెల్గటూర్ మండల విద్యావనరుల కేంద్రంలో సెక్టోరియల్ అధికారులు బాలకిషన్, ఆనందం, ఎంఇఒ భూమయ్యతో కలసి ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా సమగ్ర శిక్ష అభియాన్ అధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆధార్ నమోదును ప్రారంభించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మంగళవారం మండల వనరుల కేంద్రంలో జిల్లాలో తొలి ఆధార్ నమోదును మండలంలోని కోటిలింగాల పాఠశాలకు చెందిన గంగికోట రంజిత్ విద్యార్థి నమోదుతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలల్లో బయోమేట్రిక్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారని తెలిపారు. ఈ నేపధ్యంలో ఆధారుకార్డు లేకుండా చైల్డ్ ఇన్‌ఫోలో అను సందానం కాని విద్యార్థుల కోరకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసిందని యస్‌యస్‌ఎ అధికారులు బాకృష్ణ , ఆనందం తెలిపారు. డైస్‌లో నమోదు అయిన ప్రతి విద్యార్థి ఆధార్ తో అనుసంధానం చేసి పారదర్శకత కోసం చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ బత్తుల భూమయ్య, సిఆర్‌పిలు వైద్యవెంకటేష్, రాజారాణి, రజని, సిసిఒ శ్రీనివాస్, యం.ఐ.యస్ కవిత, ఐ.ఇ.ఆర్పిలు శ్రీలత, శ్రీనివాస్, ప్రధానోపాద్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.