విత్తన బంతులతో పెరుగనున్న అటవి సంపద

Two and a half million seed balls were made in two days
పెద్దపల్లి: విత్తన బంతుల ద్వారా అటవి సంపద పెరగుతుందని, మొక్కలను భూమిపై నాటడం కంటె విత్తన బంతులను గుట్టలు, కొండలలో వేయడం ద్వారా మొలిచిన మొక్కలలో 80 శాతం ప్రకృతి సిద్దంగా సంరక్షిచబడి వృక్షాలుగా మారుతాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. గురువారం పెద్లపల్లి మండలం అప్పన్నపేట జెడ్. పి. ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విత్తన బంతుల తయారి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విద్యార్థులు, గ్రామ ప్రజలతో కలిసి స్వయంగా విత్తన బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 14 శాతం అటవి సంపదను పెంపొందించడంలో భాగంగా భారి ఎత్తున విత్తన బంతుల కార్యక్రమం చేపట్టామని, ప్రతి గ్రామంలో లక్ష బంతుల తయారి లక్ష్యంగా జిల్లాలో రెండు రోజలు వ్యవధిలో రెండున్నర కోట్ల విత్తన బంతుల తయారిని చేసి కొండలు, గుట్టలలో వేస్తామని పేర్కొన్నారు. వర్షాలు కురిసిన తరువాత మొక్కలు మొలిచి బలమైన వృక్షాలుగా మారుతాయని అన్నారు. కర్ణాటకకు చెందిన అమర్‌నాద్ అనే ఐఎఎస్ అధికారి విత్తన బంతులను ఉపయోగించి మొక్కలను సంరక్షించడంపై అధ్యయనం చేశాడని ఇక్కడ కూడా ఆ పద్దతినే ఉపయోగిస్తూ విత్తన బంతులను తయారు చేస్తున్నామని అన్నారు. విత్తన బంతుల తయారిలో ఎలాంటి రసాయనాలు ఉపయోగించడం లేదని, ఆపుపేడ, మూత్రం, ఎర్రమట్టిని ముద్దలుగా తయారు చేసి మద్యలో విత్తనాలు పెట్టడం జరుగుతుందని అన్నారు. తాను జనగామ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఇదే పద్దతిలో కోటి విత్తన బంతులను తయారు చేసి జనగామ జిల్లాలోని గుట్టలు, కొండల ప్రాంతాలలో వేశామని ప్రస్తుతం ఆప్రాంతం 80 శాత పచ్చగా ఉందని ఏరియల్ సర్వే ద్వారా తేలిందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో నాలుగో విడత హరిత కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టామని ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యానికి మించి మొక్కలను నాటడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. హరితహరం కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల అదికారులు, ప్రజాప్రతినిదులు, విద్యార్థులు, మహిళ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రంలో జిల్లా ఇంచార్జి డిఆర్‌డివొ ప్రేమ్‌కుమార్, సిపివో రవిందర్, ఎంపిపి సునితా రాజేందర్, అప్పన్నపేట సర్పంచ్ తిరుపతి, పాఠశాల ప్రదానోపాధ్యాయులు హనుమంతు, ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments