విజేత ఇండియా- బి

Australia on India win with 9 wickets in the final

బెంగళూరు: నాలుగు జట్ల మధ్య జరిగిన వన్డే టోర్నమెంట్‌లో ఇండియాబి జట్టు ట్రోఫీను గెలుచుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో ఇండియాబి 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాఎ జట్టును చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 225 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆర్సిషార్ట్ 9 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ అలెక్స్ కారి (53) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియాబి జట్టు 36.3 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మయాంక్ అగర్వాల్ 67 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ అజేయంగా 66 పరుగులు సాధించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మనీష్ పాండే 54 బంతుల్లోన 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 73 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.