విజయ సాధనే లక్ష్యం

ఎఐసిసి కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశం మన తెలంగాణ/ఆదిలాబాద్ : 2019 ఎన్నికలే లక్ష్యంగా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీని పటిష్ట పరుస్తూ రాబోయే రోజుల్లో విజయం సాధించే దిశగా ఉమ్మడి జిల్లాలో ముఖ్య నేతలతో కలిసి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎఐసిసి కార్యదర్శి, జిల్లా పరిశీలకులు శ్రీనివాసన్ కృష్ణన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి […]

ఎఐసిసి కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్
నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశం

మన తెలంగాణ/ఆదిలాబాద్ : 2019 ఎన్నికలే లక్ష్యంగా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీని పటిష్ట పరుస్తూ రాబోయే రోజుల్లో విజయం సాధించే దిశగా ఉమ్మడి జిల్లాలో ముఖ్య నేతలతో కలిసి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎఐసిసి కార్యదర్శి, జిల్లా పరిశీలకులు శ్రీనివాసన్ కృష్ణన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రానికి వచ్చిన జాతీయ, రాష్ట్ర నాయకులకు మావల గ్రామ పంచాయతీ పరిధిలోని బైపాస్ రోడ్డు వద్ద నియోజకవర్గ ఇంచార్జీ భార్గవ్ దేశ్‌పాండే వర్గీయులు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో ఎఐసిసి సభ్యురాలు గండ్రత్ సుజాత వర్గీయులు ఎఐసిసి కార్యదర్శికి స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. పట్టణంలోని పంచవటి హోటల్ వద్ద ఎఐసిసి సభ్యులు మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్‌లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ నాయకులు ఉమ్మడి జిల్లా పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలను నియోజక వర్గాల వారిగా సమీక్షించగా ముఖ్య నాయకులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎఐసిసి కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో విసిగి పోయిన ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో పూర్తిగా విఫలం అయ్యాయని, ఈ ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి రాహుల్ గాంధీ నేతృత్వంలో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రావడమే లక్షంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగడుతూ, కాంగ్రెస్ శ్రేణులంతా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిరంతరం పార్టీ పటిష్టతకు పని చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో భాగంగా తాను ఇక్కడికి రాలేదని, కేవలం పార్టీ పటిష్టత కోసం ప్రతి నియోజకవర్గ స్థాయిలో నేతలు, శ్రేణులతో మాట్లాడానికే వచ్చానని పేర్కొన్నారు. ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాలను సఖ్యతగా నిర్వహిస్తూ ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్బంగా బీజేపీ ఇచ్చిన హామిలు, వాటి అమలు తీరును ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పాలనలో జరిగిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్‌లో ఏ ఎన్నిక వచ్చినా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవచ్చని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తూ ముందుకు సాగాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని అన్నారు.

Related Stories: