వింబుల్డన్ క్వీన్ కెర్బర్

ఫైనల్లో సెరెనా ఓటమి లండన్: ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జర్మనీ స్టార్ అంజెలిక్ కెర్బర్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల ఫైనల్లో 11వ సీడ్ కెర్బర్ 63, 63 తేడాతో మాజీ చాంపియన్, అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన కెర్బర్ ఏ దశలోనూ సెరెనాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తన మార్క్ షాట్లతో సెరెనాను ఉక్కిరిబిక్కిరి చేసింది. కెర్బర్ అసాధారణ ఆటతో చెలరేగడంతో […]


ఫైనల్లో సెరెనా ఓటమి

లండన్: ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జర్మనీ స్టార్ అంజెలిక్ కెర్బర్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల ఫైనల్లో 11వ సీడ్ కెర్బర్ 63, 63 తేడాతో మాజీ చాంపియన్, అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన కెర్బర్ ఏ దశలోనూ సెరెనాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తన మార్క్ షాట్లతో సెరెనాను ఉక్కిరిబిక్కిరి చేసింది. కెర్బర్ అసాధారణ ఆటతో చెలరేగడంతో సెరెనా కనీస పోటీని కూడా ఇవ్వలేక పోయింది. కళ్లు చెదిరే షాట్లతో కెర్బర్ ప్రత్యర్థిని కోర్టు నలుమూలలా పరిగెత్తించింది. దీంతో సెరెనా తీవ్ర ఒత్తిడికి గురైంది. ఇదే క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన కెర్బర్ సునాయాసంగా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా కెర్బర్‌కు ఎదురు లేకుండా పోయింది. దూకుడుగా ఆడుతూ లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో సెరెనాను మట్టి కరిపిస్తూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కెర్బర్‌కు ఇది తొలి వింబుల్డన్ టైటిల్ కావడం విశేషం. అంతేగాక స్టెఫిగ్రాఫ్ తర్వాత వింబుల్డన్ టైటిల్ సాధించిన తొలి జర్మనీ క్రీడాకారిణిగా కెర్బర్ చరిత్ర సృష్టించింది.
నాదల్‌కు షాక్.. ఫైనల్లో జొకొవిచ్


ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్‌లో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ సెమీఫైనల్లోనే ఓటమి పాలయ్యాడు. శనివారం హోరాహోరీగా సాగిన మారథాన్ సెమీస్ పోరులో మాజీ చాంపియన్, సెర్బియా యోధుడు నొవాక్ జొకొవిచ్ చేతిలో కంగుతిన్నాడు. ఐదు గంటలకు పైగా సాగిన సమరంలో 12వ సీడ్ జొకొవిచ్ 64, 36, 76, 36, 108 తేడాతో రెండో సీడ్ నాదల్‌పై విజయం సాధించాడు. అంతకుముందు తొలి సెమీఫైనల్ కూడా ఆరున్నర గంటలకు పైగా సాగిన విషయం తెలిసిందే. మారథాన్ సమరంలో దక్షిణాఫ్రికా స్టార్ కెవిన్ అండర్సన్ అమెరికా ఆటగాడు జాన్ ఇస్నర్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. కాగా, నాదల్‌జొకొవిచ్‌ల మధ్య జరిగిన సెమీస్ సమరం ప్రారంభం నుంచే నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు కూడా ప్రతి పాయింట్ కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. తొలి సెట్‌లో జొకొవిచ్ పైచేయి సాధించాడు. చూడచక్కని షాట్లతో అలరించిన జొకొవిచ్ 64తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ, రెండో సెట్‌లో నాదల్ పుంజుకున్నాడు. తన మార్క్ షాట్లతో జొకొవిచ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. నాదల్ చెలరేగి ఆడడంతో జొకొవిచ్ ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న నాదల్ సెట్‌ను గెలుచుకున్నాడు. మూడో సెట్‌లో మళ్లీ జొకొవిచ్ పైచేయి సాధించాడు. నాదల్‌ను హడలెత్తిస్తూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో టైబ్రేకర్‌లో సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే నాలుగో సెట్‌లో మళ్లీ పాత ఫలితం పునరావృతమైంది. ఈసారి మళ్లీ ఆధిపత్యం చెలాయించాడు. సునాయాసంగా సెట్‌ను గెలుచుకుని స్కోరును సమం చేశాడు. దీంతో చివరి సెట్‌లో పోరు యుద్ధాన్ని తలపించింది. ఇద్దరు సర్వం ఒడ్డడంతో మారథాన్ పోరు సాగింది. అయితే చివర్లో నాదల్ కాస్త ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న జొకొవిచ్ సెట్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దీంతో వింబుల్డన్ టైటిల్ గెలవాలని భావించిన నాదల్‌కు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగే ఫైనల్లో జొకొవిచ్ దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్సన్‌తో తలపడుతాడు.