వార్ హీరో, సెనెటర్ జాన్ మెక్ మృతి

న్యూయార్క్ : అమెరికా సెనేటర్, వియత్నాం వార్ హీరో, విభిన్న రాజకీయవేత్త జాన్ మెక్ కెయిన్ మృతి చెందారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. అరిజోనాలోని ఆయన స్వగృహంలో ఆయన బ్రెయిన్ ట్యూమర్ విషమించడంతో మరణించినట్లు ఆయన కార్యాలయ వర్గాలు ఒక ప్రకటన వెలువరించాయి. గత ఏడాదిగా ఆయన బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ, చికిత్స పొందుతూ వస్తున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు నౌకాదళ అధికారిగా వ్యవహరించిన కెయిన్ ఉత్తర వియత్నామిల బందీగా ఐదు ఏళ్లు గడపాల్సి వచ్చింది. ఈ […]

న్యూయార్క్ : అమెరికా సెనేటర్, వియత్నాం వార్ హీరో, విభిన్న రాజకీయవేత్త జాన్ మెక్ కెయిన్ మృతి చెందారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. అరిజోనాలోని ఆయన స్వగృహంలో ఆయన బ్రెయిన్ ట్యూమర్ విషమించడంతో మరణించినట్లు ఆయన కార్యాలయ వర్గాలు ఒక ప్రకటన వెలువరించాయి. గత ఏడాదిగా ఆయన బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ, చికిత్స పొందుతూ వస్తున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు నౌకాదళ అధికారిగా వ్యవహరించిన కెయిన్ ఉత్తర వియత్నామిల బందీగా ఐదు ఏళ్లు గడపాల్సి వచ్చింది. ఈ సందర్భంగా చిత్రహింసల పాలయి, తరువాత రాజకీయాలలోకి వచ్చిన ఈ సెనెటర్ ఆరోగ్య పరిస్థితి ఒక వారంగా క్షీణిస్తూ వచ్చింది. ఆయన వంటి గొప్ప వ్యక్తితో తాను 38 సంవత్సరాలుగా జీవితాన్ని పంచుకుంటూ వస్తున్నానని, ఆయన వెళ్లిపోవడం తనకు తీరని ఆవేదనను కల్గిస్తోందని భార్య సిండీ మెక్ కెయిన్ స్పందించారు.

Comments

comments

Related Stories: