వామ్మో.. ముక్కులో జలగ…!(వీడియో)

బీజింగ్: ఇది నిజంగా షాకింగ్ వార్త. ఓ వ్యక్తి ముక్కులోంచి వైద్యులు బతికి ఉన్న జలగను బయటకు తీశారు. ఈ షాకింగ్ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… గత వారం రోజులుగా ఓ వ్యక్తి ముక్కులోంచి రక్తం కారుతోంది. మొదట అతడు దీన్ని తేలికగా తీసుకున్నాడు. కాని, ఎంతకూ రక్తస్రావం ఆగకపోవడంతో అతడు తన భార్య సహాయంతో ముక్కులో గమనించి చూడగా లోపలి భాగంలో ఎదో ఉన్నట్టు గుర్తించాడు. అనుమానం వచ్చిన అతడు వెంటనే వైద్యుల వద్దకు […]

బీజింగ్: ఇది నిజంగా షాకింగ్ వార్త. ఓ వ్యక్తి ముక్కులోంచి వైద్యులు బతికి ఉన్న జలగను బయటకు తీశారు. ఈ షాకింగ్ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… గత వారం రోజులుగా ఓ వ్యక్తి ముక్కులోంచి రక్తం కారుతోంది. మొదట అతడు దీన్ని తేలికగా తీసుకున్నాడు. కాని, ఎంతకూ రక్తస్రావం ఆగకపోవడంతో అతడు తన భార్య సహాయంతో ముక్కులో గమనించి చూడగా లోపలి భాగంలో ఎదో ఉన్నట్టు గుర్తించాడు. అనుమానం వచ్చిన అతడు వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాడు. పరీక్షించి చూసిన వైద్యులు సదరు వ్యక్తి ముక్కులో ఎదో జీవి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే దాన్ని బయటకు తీయగా, అది రక్తం పీల్చే  భయంకరమైన జలగ అని తెలిసింది. అది అప్పటికి ప్రాణాలతోనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే, అంత పెద్ద జలగ ముక్కులో దూరిన అతడికి తెలియకపోవడం షాకింగ్ కు గురిచేసే అంశమే అని చెప్పాలి.

Related Stories: