వానలే వానలు

జోరు వర్షంతో పులకిస్తున్న రైతన్న జూరాలకు స్వల్పంగా పెరుగుతున్న ఇన్‌ఫ్లో తుంగభద్ర నదిలోనూ పెరుగుతున్న వరద నీరు పంటలకు మేలు చేసిన అల్పపీడన ద్రోణి వరి, మొక్క జొన్న, కంది, పెసర, పత్తి పంటలకు మేలు హరిత హారంకు సిద్దమవుతున్న అధికారులు మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడ తెరిపి లేకుం డా జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు అవుతోంది. […]

జోరు వర్షంతో పులకిస్తున్న రైతన్న
జూరాలకు స్వల్పంగా పెరుగుతున్న ఇన్‌ఫ్లో
తుంగభద్ర నదిలోనూ పెరుగుతున్న వరద నీరు
పంటలకు మేలు చేసిన అల్పపీడన ద్రోణి
వరి, మొక్క జొన్న, కంది, పెసర, పత్తి పంటలకు మేలు
హరిత హారంకు సిద్దమవుతున్న అధికారులు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడ తెరిపి లేకుం డా జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు అవుతోంది. చిన్న చిన్న వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇంకా ఈ వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. జోరు వానలతో పత్తి, మిరప, కంది, పెసర, వేరుశెనగ, జొన్న పంటలకు మేలు జరిగింది. విత్తనాలు వేసుకున్న పొలాల్లో కూడా విత్తనాలు మొలకెత్తుతున్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు అవుతుండగా, మరి కొన్ని ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షపాతం నమోదు అవుతోంది. ముసురు వర్షాలతో అన్ని పంటలకు మేలు జరిగిందనే చెప్పాలి. మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రతి రోజు భారీ వర్షం నమోదు అవుతోంది. అచ్చంపేట, నాగర్‌కర్నూలు తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు అవుతోంది. అటు గద్వాల, వనపర్తి జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. భారీ వర్షాలకు వరదలు వచ్చే అవకాశాలు ఉన్నందున వానలతో ఎటువంటి సంఘటనలు జరిగినా వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికార సిబ్బంది సిద్దంగా ఉన్నారు. ఇప్పటి వరకు భారీ వర్షాల వలన ఎటువంటి అనర్థాలు జరగక పోయినప్పటికీ అధికారులు అన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. వేసిన పంటలు కళకళలాడుతుండగా, ఇప్పడిప్పడు వేసిన పంటలకు కూడా ఈ వర్షాలు మేలు జరుగుతున్నాయి.ఈ వర్షాలతో చిన్న చిన్న చెరువులు నిండుతుండమే కాకుండా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి.

తుంగభద్ర, కృష్ణకు పెరుగుతున్న వరదలు
అటు కర్నాటక, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురస్తుండడంతో కృష్ణ,తుంగభద్ర నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బళ్లారీలోనూ అటు కర్నూలు జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదు అవుతుండడంతో తుంగభద్ర నదికి భారీగా ఇన్‌ఫ్లో నీరు పెరుగుతోంది. బుధవారంకు తుంగభద్ర నదికి 45 వేలు క్యూసెక్కుల నీరు తుంగభద్ర నదిలోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 45 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా,అవుట్ ఫ్లో162 క్యూసెక్కులు వదులు తున్నారు. ప్రాజెక్టులో 1633.00 పూర్తి స్థాయి అడుగులు ఉండగా. 1615.18 అడుగులు ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు పూ ర్తి సామర్థం 100.86 టిఎంసిలకు గానూ,46.160 టిఎంసిలు నిల్వ ఉంది. మహారాష్ట్రలోనూ వర్షాలు కురుస్తుండడంతో స్వల్పంగా వరద నీరు కిందికి వస్తోంది.ఆల్మట్టిలో స్వల్పంగా నీరు వస్తోంది. నారాయణపూర్ డ్యాంకు వరద నీరు రాకున్నప్పటికీ ఆ కింద కురుస్తున్న భారీ వర్షాలకు జూరాలకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది బుధవారం నాటికి 317 క్యూసెక్కుల నీరు జూరాలకు వచ్చి చేరుతుండగా అవుట్ ఫ్లో రైట్ కెనాల్‌కు 55, లెఫ్ట్ కెనాల్‌కు 77 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు జూరాల డిఇ విద్యాకర్ తెలిపారు.డ్యాం పూర్తి స్థాయిలో 9.65 టిఎంసిల కెపాటిసి ఉండగా ప్రస్తుతం 5.567 టిఎంసిలు ఉన్నప్పటికీ బురదతో నిండిఉండగా లైవ్‌లో 2.057 టిఎంసిలు ఉంటుందని డిఇ తెలిపారు. గత ఏడాదితో పోల్చితే డ్యాంలో సగానికి కూడా నీరు చేరలేదని ఆయన తెలిపారు. ఎగువలో వర్షాలు సంవృద్దిగా కురిస్తే జూరాలకు వరద నీరు భారీగా చేరే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

హరిత హారానికు సిద్ధవుతున్న అధికార యంత్రాంగం
జిల్లాలల్లో జోరుగా వానలు కురుస్తుండడంతో జిల్లా అధికార యంత్రాంగం భారీగా హరిత హారానికి శ్రీకారం చుట్ట నుంది. జిల్లాలో నాల్గవ విడుత కింద 1.97 కోట్ల మొక్కలు నాటాలని ల్యక్షంగా నిర్ణయించగా, నర్సరీల్లో 2.07 కోట్ల మొక్కలు సిద్దంగా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జోరుగా వర్షాలు కురుస్తుండంతో మొక్కలు నాటితే అనేక చెట్లు బతికే అవకాశాలు ఉంటాయని భావించిన ప్రభుత్వం తెలంగాణకు హారతి కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.గత మూడు విడుతులుగా నాటిన మొక్కల్లో కనీసం 50 శాతంకు పైగా మొక్కలు బతికినట్లు అధికారికి లెక్కలు చెబుతున్నాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కల నాటే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా , నాటిన ప్రతి మొక్క బతకాలనే లక్షంతో వాటికి రక్షణగా ట్రీ గార్డులు ఏర్పాటు చేసి రక్షించే ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున అడవులను రక్షించేందుకు కార్యచరణ రూపొందించింది. కాల్వలు, ప్రభుత్వ పాఠశాలలు, భవనాలు, రోడ్ల వెంబడి, పొలాల గట్ల వెంబడి, ఎక్కడ ఖాళీ స్థలాల ఉంటే అక్కడ మొక్కలు నాటేందుకు పూనుకుంది.హరిత హారంలో ప్రభుత్వమే కాకుండా ప్రజల్ని భాగస్వామ్యం చేసి మరీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

కోటి మొక్కలు సిద్ధం
రైతులు తమ పొలాల గట్ల వెంబడి మొక్కలను నాటుకునేందుకు ఇష్టపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మొక్కలను సిద్ధం చేసింది. దాదాపు కోటీ 3 లక్షల మొక్కలను ఆయా నర్సిరీల్లో సిద్ధంగా ఉంచింది. పొలాల గట్లు వెంబడి ఈ మొక్కలను నాటుకోవడం వలన రైతులకు భవిష్యత్‌లో అదనపు ఆదా యం లభిస్తుందనే లక్షంతో టేకు మొక్కలను సిద్ధం చేసింది.

జడ్చర్లలో ఊరటనిస్తున్న వర్షాలు
జడ్చర్లలో వరుసగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నాయి. గత మూడు రోజులుగా ముసురుతో కూడిన వర్షాలు కురువగా బుధవారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. ఈ వర్షాలతో రైతుల్లో ఆనందం చోటుచేసుకుంది. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు బాగానే కురిసినా మొన్నటివరకు పత్తాలేకుండా పోయిన వర్షాలు రైతుల్లో ఆందోళనలు నింపాయి. గత సంవత్సరం జూన్, జూలై నెలలో కురిసిన వర్షాలను మించి కురిశాయి. గత ఖరీఫ్‌లో జూన్‌లో సాధారణ వర్షపాతం 87 మీ.మీ. సాధారణ వర్షపాతం కాగా అంతకుమంచి 132 మి.మి వర్షపాతం నమోదైంది.

Related Stories: