వాజ్‌పేయిని పరామర్శించిన వెంకయ్య, కేజ్రీవాల్

Venkaiah-naidu,-Kejriwal

న్యూఢిల్లీ: బిజెపి అగ్రనేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. వాజ్‌పేయి మూత్రకోశం ఇన్‌ఫెక్షన్, ఛాతీలో నొప్పి, మూత్ర పరిణామం తగ్గడం వంటి పరిణామాలతో ఇబ్బంది పడుతుండడంతో స్థానిక ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.  ఈ నేప‌థ్యంలోనే గురువారం ఉద‌యం భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయిని ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వెంకయ్య నాయుడు హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు.  బుధవారం సాయంత్రం 7.15కు ఎయిమ్స్ చేరుకున్న ప్రధాని అక్కడ దా దాపు గంట సేపు ఉన్నారు. బుధవారమే కేంద్ర జవుళి మంత్రి స్మృతి ఇరానీ, బిజెపి అధ్యక్షులు అమిత్ షా ఇతర నేతలు కూడా ఈ ప్రతిష్టాత్మక వైద్య సంస్థకు వచ్చి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసిన తెలిసిందే.

Comments

comments