వాజపేయి ఆరోగ్యం అత్యంత విషమం : రాజ్‌నాథ్

His condition continues to be critical says Home Minister Rajnath Singh

న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. వాజపేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం మధ్యాహ్నం వాజపేయిని చూసేందుకు రాజ్ నాథ్ ఎయిమ్స్ చేరుకున్నారు. అనంతరం వాజపేయి ఆరోగ్య వివరాలను ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మాడీ దాదాపు 40 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. అనంతరం మోడీ ఎయిమ్స్ నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని ముఖం ఎంతో ఆవేదనాభరితంగా కనిపించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు రోజుల పర్యటన భాగంగా హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ… గురువారం మధ్యాహ్నం ఆయన కూడా ఢిల్లీకి బయల్దేరారు. బిజెపి పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో ఎయిమ్స్ వైద్యులు అత్యంత కీలకమైన వాజపేయి హెల్త్ బులిటిన్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ బులిటిన్ లో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని వాజపేయి అభిమానులు, బిజెపి నేతలందరు ఆందోళన చెందుతున్నారు.