వర్షాకాలం వెచ్చగా..

ఓవర్‌కోట్ స్థానాన్ని ఆక్రమించేసిన ష్రగ్ జీన్స్, లెగ్గింగ్, ఏదైనా సరే దాని మీద ఓ టాప్ వేసుకుంటే డ్రెస్సింగ్ పూర్తయిందని ఈ కాలం అమ్మాయిలు అసలు అనుకోవడం లేదు. డ్రెస్ వేస్తే స్టైల్ గాను,సీజనల్ గానూ ఉండాలి. ప్రస్తుతం యువత మనసుకి అదే నచ్చుతోంది.  మార్కెట్‌లో సందడి చేస్తూ మనసు కొల్లగొడుతున్న ష్రగ్ అదే కోవకు చెందుతుంది. వర్షాకాలం ప్రారంభమైన వేళ ష్రగ్ విశేషాలు తెలుసుకుందాం…. టాప్ ఏదైనా ష్రగ్ ఉండాల్సిందే. కాటన్, టీషర్ట్ ఇలా టాప్ […]

ఓవర్‌కోట్ స్థానాన్ని ఆక్రమించేసిన ష్రగ్

జీన్స్, లెగ్గింగ్, ఏదైనా సరే దాని మీద ఓ టాప్ వేసుకుంటే డ్రెస్సింగ్ పూర్తయిందని ఈ కాలం అమ్మాయిలు అసలు అనుకోవడం లేదు. డ్రెస్ వేస్తే స్టైల్ గాను,సీజనల్ గానూ ఉండాలి. ప్రస్తుతం యువత మనసుకి అదే నచ్చుతోంది.  మార్కెట్‌లో సందడి చేస్తూ మనసు కొల్లగొడుతున్న ష్రగ్ అదే కోవకు చెందుతుంది. వర్షాకాలం ప్రారంభమైన వేళ ష్రగ్ విశేషాలు తెలుసుకుందాం….

టాప్ ఏదైనా ష్రగ్ ఉండాల్సిందే. కాటన్, టీషర్ట్ ఇలా టాప్ ఏదైనా దాని మీద ఓ ష్రగ్ ఉంటేనే స్టైలిష్‌గా ఉన్నట్టు భావిస్తున్నారు. ఒకప్పుడు జాకెట్ లేదా ఓవర్ కోట్ అనేది కొన్ని వర్గాల మహిళలు మా త్రమే ధరించే వారు. కాని ష్రగ్ అలా కాదు టీనేజర్లు నుంచి కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే మహిళల వరకూ అంతా ఇష్టంగా వేసుకుంటున్నారు. కారణం డెనిమ్ జాకెట్ మాదిరిగా మరీ మందంగా కాకుండా నైలాన్ బనియన్ మెటీరియల్‌తో తేలికగానూ ఉంటుంది. ఓవర్ కోట్ మాదిరిగానూ పనిచేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం చలికాలాల్లో వెచ్చగా,హాయిగా ఉంటుంది.

దాంతో దీన్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. పైగా ఈ మధ్య వచ్చే టాప్‌లన్నీ ఎక్కువగా స్లీవ్‌లెస్సే ఉంటున్నాయి. దాంతో చాలామందికి డ్రెస్సింగ్‌లో ష్రగ్ తప్పనిసరి అయింది.
* రకాలెన్నో ః పొడవు చేతులతో ఓవర్ కోటు మాదిరిగా ఉండే ష్రగ్ దేనిమీదకైనా బాగానే ఉంటుంది. దీన్నే బేసిక్ ష్రగ్ అంటారు. వీటిల్లో త్రీ ఫోర్త్ స్టీమ్స్‌తో పాటు స్లీవ్‌లెస్ కూడా వస్తున్నాయి. వీటి లోపల కొన్నింటికి పై భాగంలో ఒకటే ఉంటోంది. కొన్నింటికి పైభాగంలో ఒకటే ఉంటోంది. కొన్నింటికి అస్సలే ఉండదు. అలాగే షర్టు లేదా టాప్‌ని దాటి ఫ్యాంట్ మీదకు కుచ్చెళ్ల మాదిరిగా వేలాడే పోడవాటి స్రగ్స్ కూడా ఉన్నాయి. వీటి అంచుల్ని ముడేస్తే అదో స్టైల్ మరీ పొడవు వద్దనుకుంటే కింద భాగంలో టీ షర్టు కనిపించేలా మీడియం సైజ్ స్రగ్‌లూ వస్తున్నాయి.అంచులు కనిపించకుండా వెనక్కి పట్టినట్టుగా ఉంటాయి.

* ష్రగ్ పుట్టిందిలా పొట్టి, పొడవు చేతులతోనూ అస్సలు చేతులు లేకుండా ఛాతీమీదకు మాత్రమే వచ్చే చిన్న సైజు ష్రగ్‌లూ ఉన్నాయి. వీటిని చాలా మంది గౌనులు మీద కూడా వేస్తుంటారు.
నిజానికి ష్రగ్ ఈ రకం నుంచే పుట్టింది. పాశ్చాత్య దేశాల్లో మహిళలు లేసు లేదా ఊలుతో అల్లిన చిన్న సైజు స్వెట్టర్లు లాంటి దాన్ని ఫ్రాక్‌ల మీద ధరించేవారు. కేవలం చేతులు ఉండి భుజాల మీదుగా ఛాతీ మీదకు వచ్చే ఈ పొట్టి స్వెట్టర్లు లేదా కోటులు స్లీవ్‌లెస్, టాప్‌లు ఫ్రాకుల మీదకు చక్కగా సరిపోయేవి. ఇవే క్రమంగా ష్రగ్‌గా రూపాంతరం చెందా యి.

* భిన్న వర్ణాల మేళవింపు ః మొదట్లో కేవలం నలుపు, తెలుపు, రంగు ష్రగ్‌లు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు అన్ని రంగుల్లో వస్తున్నాయి. టీషర్టు లేదా టాప్ రంగు ని బట్టి ష్రగ్ కలర్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు. భిన్నవర్ణాల మేళవింపు ఎప్పుడూ ఫ్యాషనే కదా, ఇప్పటికైనా మీ దగ్గర ష్రగ్ కలెక్షన్ ఉంటే సరి.  లేదం టే మీరూ ఓ ష్రగ్ కొనండి ట్రెండీ లుక్ ఇవ్వండి. ఆనందంగా ఉండండి.