వర్షపాతం తగ్గించే పుప్పొడి

hibiscus

పువ్వుల్లో పుప్పొడిని మనం వాసన చూడగానే తుమ్ములు వస్తాయి. కానీ అవి వర్షపాతాన్ని కూడా తగ్గిస్తాయి. ఇదివరకటి పరిశోధనలకు భిన్నంగా కొత్త పరిశోధన పుప్పొడి రేణువులు కాలుష్యం లేని ఖండాంతర ప్రదేశాలో వర్షపాతాన్ని సరాసరిన మూడోవంతు తగ్గిస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఒక్క చినుకు చుక్క కూడా పడనివ్వదని వెల్లడించింది. పరాగ రేణువులు వెదజల్లే సీజన్‌లో ప్రతి ఘనపు మీటరు పరిమాణం గాలిలో 10 నుంచి 1000 గ్రాముల పుప్పొడి రేణువులు ఉంటాయి. అయితే  వాతావరణం తడిగా లేక తేమగా  ఉన్నప్పడు ఈ పుప్పొడి  రేణువులు  ఉబ్బి పేలుతాయి.

క్యూబిక్ మీటర్ గాలిలో 100 మిలియన్  చిన్న రేణువులుగా తునకలవుతాయి. ఈ చిన్న రేణువులు మబ్బులను కురియనీయకుండా అడ్డుకుంటాయి. చిన్న బిందువులుగా తయారు కావడానికి ప్రోత్సహిస్తాయి. ఆ బిందువులు  చినుకులుగా కురియడానికి చాలినంత ఉండవు. మిచిగన్ యూనివర్శిటికీ చెందిన పరిశోధకులు మేడ్యూఉచ్‌నియక్ అతని సహచరులు ఈ  పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనలన్నీ “ జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌” లో ప్రచురితమయ్యాయి. ఈ  ప్రయోగాల వల్ల  అమెరికాలో పశ్చిమ ప్రాంతాల్లో  నూరుశాతం వర్షపాతం  తగ్గిపోయింది. పుప్పొడి రేణువుల వల్ల ఎలర్జీ లాంటివి సంభవిస్తాయి.ఇవి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. పిడుగులు పడడం, లేదా ఇతర సంఘటనలకు కూడా ఇవి దోహదం చేస్తాయని పరిశోధకులు చెప్పారు.

Comments

comments