వరుసగా రెండో‘సారీ’

రేపో రేటును పావు శాతం పెంచిన ఆర్‌బిఐ దీంతో 6.25 నుంచి 6.50 శాతానికి పెరిగిన వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం ఒత్తిడి కారణంగానే పెంపు నిర్ణయం ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ న్యూఢిల్లీ : విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా ఆర్‌బిఐ మరోసారి పావు శాతం మేరకు వడ్డీ రేట్లను పెంచింది. అయితే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో పాల సీ దృక్పథాన్ని తటస్థంగా ఉంచింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు పెరగడం, ఇంకా రికవరీ దశలో వృద్ధి రేటు […]

రేపో రేటును పావు శాతం పెంచిన ఆర్‌బిఐ
దీంతో 6.25 నుంచి 6.50 శాతానికి పెరిగిన వడ్డీ రేట్లు
ద్రవ్యోల్బణం ఒత్తిడి కారణంగానే పెంపు నిర్ణయం
ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్

న్యూఢిల్లీ : విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా ఆర్‌బిఐ మరోసారి పావు శాతం మేరకు వడ్డీ రేట్లను పెంచింది. అయితే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో పాల సీ దృక్పథాన్ని తటస్థంగా ఉంచింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు పెరగడం, ఇంకా రికవరీ దశలో వృద్ధి రేటు వంటి అంశాల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బిఐ గవర్నల్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపిసి(పార్లమెంటరీ పాలసీ కమిటీ) రెపో రేటు(వాణిజ్య బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ ఇచ్చే రేటు)ను 25 బేసిస్ పాయింట్లు పెంచగా, ఇది 6.50 శాతానికి చేరుకుంది. అలాగే రివర్స్ రెపో రేటు(బ్యాంకుల నుంచి తీసుకునే నిధులకు ఇచ్చే రేటు) కూడా 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో 6.25 శాతానికి చేరింది. కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు సభ్యులు రేటును పెంచేందుకు ఓటు వేశారు. ఏప్రిల్‌సెప్టెంబర్ కాలానికి గాను జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటును 7.5- నుంచి 7.6 శాతంగా ఉంటుందని, 201819 ఆర్థిక సంవత్సరానికి గాను 7.4 శాతంగా ఆర్‌బిఐ అంచనా వేసింది. వరుసగా రెండో నెలలోనూ ఆర్‌బిఐ వడ్డీ రేటును పెంచడం 2013 అక్టోబర్ నుంచి ఇదే తొలిసారి కావడం విశేషం. జూన్‌లో తొలిసారిగా రెపో రేటును పావు శాతం పెంచగా 6.25 శాతం అయింది. దాదాపు నాలుగున్నర ఏళ్ల తర్వాత జూన్‌లో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే.
రుణాల రేట్లు మరింత భారం
సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో బ్యాంకు రుణాల రేట్లు మరింత భారం కానున్నాయి. ఆర్‌బిఐ వడ్డీరేట్లు పెరిగితే ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తద నుగుణంగా తమ రుణాలపై కూడా వడ్డీరేట్లను పెంచు తాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత ప్రియమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ద్రవ్యోల్బణం అంచనా 4.8 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201819) ద్వితీయార్థంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.8శాతంగా నమోదుకావొచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది. జులైసెప్టెంబర్ కాలానికి గాను రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 4.6 శాతం, 201920 తొలి త్రైమాసికం(ఏప్రిల్‌జూన్)లో 5 శాతంగా ఆర్‌బిఐ పేర్కొంది. ఇది ఆర్‌బిఐ నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణం రేటు లక్షం 4 శాతాన్ని దాటిపోయింది. మద్దతు ధరను పెంచడంతో ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయని, ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమవుతుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేస్తోంది.
జిడిపి 7.4 శాతం
2018-19లో జిడిపి(స్థూల దేశీ యోత్పత్తి) వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదు కావొచ్చని రిజర్వు బ్యాంక్ అంచ నా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు అంచనాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రథమార్థంలో 7.5- నుంచి 7.6 శాతం వృద్ధి, అక్టోబర్-మార్చి మధ్య 7.3 నుంచి 7.4 శాతం వృద్ధి అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(201920)లో 7.5 శాతం జిడిపి వృద్ధి రేటును అంచనా వేసింది.

ఫారెక్స్ మార్కెట్ సమయం పొడిగింపుపై కమిటీ

కరెన్సీ ఫ్యూచర్స్ వంటి విభాగాలకు మార్కెట్ సమయం పొడిగించాలనే డిమాండ్‌పై కమిటీని ఏర్పాటు చేయ నున్నట్టు రిజర్వు బ్యాంక్ పేర్కొంది. దేశీయ మార్కెట్లను అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు మార్కెట్ టైమింగ్స్‌పై చర్చిస్తున్నామని డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య అన్నారు. దేశీయ మార్కెట్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నా లు చేస్తామని అన్నారు.

ఐసిఐసిఐ బ్యాంక్ వివాదంపై నో కామెంట్

వీడియోకాన్ కేసులో ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ చందా కొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు ఆర్‌బిఐ నిరాకరించింది. కార్పొరేటు పాలన సమస్యకు సంబంధించిన ఈ బ్యాంక్ వివాదం చర్చనీయాంశంగా మారింది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఏమి జరుగుతుందో తెలుసుకుని, పరిస్థితులను చక్కదిద్దేందుకు పరిష్కారం చూస్తాం, అయితే ప్రత్యేకించి బ్యాంకుల విషయంలో ఏం చేస్తున్నామని చెప్పలేమని ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్ తెలిపారు.

ఆర్‌బిఐ పాలసీ ముఖ్యాంశాలు
ఆర్‌బిఐ కీలక వడ్డీ రేటు(రెపో) 25 బేసిస్ పాయింట్లు పెంపుతో 6.5 శాతానికి చేరింది
రెండు నెలల్లో వరుసగా రెండోసారి వడ్డీ రేటు పెంపు
దీనికి అనుగుణంగానే రివర్స్ రెపో రేటును పావు శాతం పెంపుతో 6.25 శాతానిరి చేరింది
కొత్త మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 6.75 శాతం
ద్రవ్య విధాన దృక్పథం ఇప్పటికీ తటస్థం
ఏప్రిల్ సెప్టెంబర్ కాలానికి గాను జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ది రేటు అంచనా 7.57.6 శాతం
2018-19 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు అంచనా 7.4 శాతం
201819 ద్వితీయార్థంలో రిటైల్ ద్రవ్యో ల్బణం అంచనా 4.8 శాతం
ఐదుగురు సభ్యులు రేటు పెంచేందుకు ఓటు, ఒకరు వ్యతిరేకం
అక్టోబర్ 3 నుంచి తర్వాతి మూడు రోజుల ఎంపిసి(పార్లమెంటరీ పాలసీ కమిటీ) సమా వేశం
నాలుగో ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష అక్టోబర్ 5న
ఆగస్టు 16న ఆర్‌బిఐ మినిట్స్

Related Stories: