వరదలైతేనేం.. మా గొంతులో సుక్క పడాల్సిందే..!(వీడియో)

Kerala floods: People risks for alcohol video going viral

తిరువనంతపురం: కేరళను భారీ వర్షాలు ముంచెత్తడంతో చిగురుటాకుల వణుకుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి వరదలు పొటెత్తడంతో రాష్ట్రం నలుమూలల వర్షపు నీరే కనిపిస్తుంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు లేక కొన్ని ప్రాంతాల్లో జనాలు గత కొన్ని రోజులుగా అల్లాడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి సమయంలో అదేదో నానుడి ‘ఇల్లుకాలి ఒకడు ఏడిస్తే బీడి ముట్టించుకోవడానికి నిప్పు అడిగాడట వెనుకటికి ఎవడో ఒకడు’ అన్నట్టుగా ఉంది అక్కడ కొందరు మందుబాబుల తీరు చూస్తుంటే. ఓ వైపు రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తుంటే మరోవైపు ఆ మందుబాబులు మాత్రం సుక్క కోసం పడరాని పాట్లు పడ్డారు. వరద నీటి లోతట్టు ప్రాంతాలు జలశయాలను తలపిస్తుంటే ఆ ఉప్పెనలో కూడా ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకువచ్చిన మందు సీసాలను మూట కట్టడం ప్రారంభించాడు. దాన్ని అందుకోవడానికి మరో వ్యక్తి కాళ్ళను వంతెన మీద నుంచి పట్టుకున్నాడు ఇంకొక వ్యక్తి. ఎలగొల ఆ మూటను పైకి తీసుకువచ్చిన మందుబాబు ఒక్కొక్కటిగా తన షర్టులో, లుంగీలో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వీడియోలో చూస్తే పాపం వాళ్ళు ఎవరో వరదల్లో చిక్కుకుంటే  కాపాడుతున్నారేమో అనిపిస్తుంది. కానీ వాళ్లు అంతలా కష్టపడింది మందు సీసాల కోసం. ఆ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.