వరంగల్‌లో ఐదు బస్సులు దగ్ధం

Bus Burned in Fire Accident

వరంగల్: వరంగల్ ఆర్‌టిసి డిపో-1లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదు బస్సులు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆరా తీసి, విచారణకు ఆదేశించారు. విద్యుత్ షార్ట్‌సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. హన్మకొండ బస్టాండును ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ పరిశీలించారు. వరంగల్ ఆర్‌టిసి డిపో-1 బస్సుల దగ్ధమైన స్థలాన్ని సోమారపు పరిశీలించారు. ఘటన వివరాలను డిపో మేనేజర్ అడిగి తెలుసుకున్నారు.