వన్య ప్రాణులకు భద్రతేది..?

మనతెలంగాణ /లింగంపేట:మానవాళి మనుగడకు ఎలాంటి హాని తలపెట్టని అందమైన వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో పడి అంతరించి పోతున్నాయి. కామారెడ్డి జిల్లాలో వన్యప్రాణుల వేట యదేఛ్చగా సాగుతున్నా సంబందిత అటవీశాఖ అదికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని గాందారి ,మాచారెడ్డి ,లింగంపేట, ఎల్లారెడ్డి, ఇందల్‌వాయి, బాన్స్‌వాడ,నాగిరెడ్డిపేట, నస్రుల్లాబాద్, పిట్లం, నిజాంసాగర్, జుక్కల్, రాజంపేట, రామారెడ్డి, బిక్కనూరు తదితర మండలాలో వన్యప్రాణుల వేట నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆయా మండలాలలోని కొందరు వేటగాళ్లు వన్యప్రాణుల వేటనే జీవనాదారంగా […]


మనతెలంగాణ /లింగంపేట:మానవాళి మనుగడకు ఎలాంటి హాని తలపెట్టని అందమైన వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో పడి అంతరించి పోతున్నాయి. కామారెడ్డి జిల్లాలో వన్యప్రాణుల వేట యదేఛ్చగా సాగుతున్నా సంబందిత అటవీశాఖ అదికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని గాందారి ,మాచారెడ్డి ,లింగంపేట, ఎల్లారెడ్డి, ఇందల్‌వాయి, బాన్స్‌వాడ,నాగిరెడ్డిపేట, నస్రుల్లాబాద్, పిట్లం, నిజాంసాగర్, జుక్కల్, రాజంపేట, రామారెడ్డి, బిక్కనూరు తదితర మండలాలో వన్యప్రాణుల వేట నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆయా మండలాలలోని కొందరు వేటగాళ్లు వన్యప్రాణుల వేటనే జీవనాదారంగా చేసుకుని జీవిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఎల్లారెడ్డి, లింగంపేట, గాందారి, బాన్స్‌వాడ, మాచారెడ్డి, ఇందల్‌వాయి, మండలాలల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. ఈప్రాంతాలలోని అడవులలో చిరుతపులులు, ఎలుగుబంట్లు, మనుబోతులు, సాంబార్‌లు,జింకలు, కొంగొర్రెలు,దుప్పులు, ఉడుములు, కుందేళ్లు, అడవిఆలుగులు, ఏదు(ముళ్లపంది)లు, అడవిపందులు, నెమళ్లు, గువ్వలు, కంజుపిట్టలు, ఇలా ఎన్నో రకాలకు చెందిన వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అడవులలో ఏపుగా పెరిగే గడ్డి, చెట్ల ఆకులను తింటూ వన్యప్రాణులు జీవిస్తున్నాయి. వీటిలో అడవిపందులు మాత్రమే రైతులు పండించే పంటలను ద్వంసం చేసి నష్ట పరుస్తాయి. మిగతా జాతులకు చెందిన వనప్రాణులు,పక్షులు మానవ మనుగడకు ఎలాంటి ఆటంకం కల్గించవు.

అయినప్పటికినీ కొందరు వేటగాళ్లు నిత్యం వన్యప్రాణులను వేటాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వన్యప్రాణుల మాంసాన్ని మెదక్, హైదరాబాద్,కామారెడ్డి,నిజామాబాద్,కరీంనగర్ ,ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నాటు తుపాకులు,వలలు, ఉచ్చులు, బ్యాటరీల సహాయంతో వన్యప్రాణులను వేటాడుతున్నారు. జిల్లాలోని ఇందల్‌వాయి, మాచారెడ్డి, గాందారి, ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి,బాన్స్‌వాడ, మండలాల లో నాటుతుపాకులతో వన్య ప్రాణుల వేట కొనసాగుతుండగా పిట్లం, జుక్కల్, బిచ్కుంద,నిజాంసాగర్, రాజంపేట, బిక్కనూరు,రామారెడ్డి, నస్రుల్లాబాద్, తదితర మండలాలలో ఉచ్చులు, వలల సహాయంతో వేట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అడవులలో వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను వాటి పాదముద్రల ఆదారంగా పగటి వేళల్లో గుర్తించి రాత్రి వేళల్లో వేటను కొనసాగిస్తున్నారు. వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు చెరువులు, కుంటలు. పంట పొలాల వద్దకు వస్తుంటాయి. దాంతో వేటగాళ్లు ఈజీగా వాటిని వేటాడుతున్నారు. పెద్ద జంతువులైన మనుబోతులు, సాంబార్‌లు, జింకలు, చిరుతపులులు, ఎలుగుబంట్లు,దుప్పులను, ముళ్లపందులను వేటాడేందుకు కొందరు వేటగాళ్లు ఇనుప చువ్వలతో చేసిన ఉచ్చులను, ద్విఛక్రవాహానాలకు ఉపయోగించే క్లచ్‌వైర్లతో తయారు చేసిన ఉచ్చులను ఉపయోగిస్తున్నారు. కుందేళ్లు,కొండగొర్రెలు,జింకలు ,అడవిఆలుగులు,తదితర చిన్న జంతువులను వేటాండేందుకు వలలు, కరెంట్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు.
జిల్లాలోని బొప్పాస్‌పల్లి గ్రామ శివారులో సోమవారం రెండేళ్ల వయసు కల్గిన చిరుతపులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడిన సంగతి పాఠకులకు విదితమే. జిల్లాలో వన్య ప్రాణుల వేట కొనసాగుతుందనడానికి ఇదే నిదర్శనంగా నిలుస్తోంది. మండలాలలో, గ్రామీణ ప్రాంతాలలో వన్యప్రాణుల మాంసాన్ని కుప్పలుగా వేసి బహిరంగంగా విక్రయిస్తుండగా, అందమైన కుందేళ్లను ప్రాణాలతో పట్టుకుని డోర్‌డెలివరి చేస్తున్నా రు. చిరుతపులుల చర్మం, గోర్లకు బాగా డిమాండ్ ఉండడంతో వాటిని ప్రణాళిక ప్రకారం ఉచ్చులు ఏర్పాటు చేసి కర్రలతో చితకబాది హతమార్చి వాటి చర్మాన్ని, గోర్లను పట్టణ ప్రాంతాలలో రహస్యంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వేటగాళ్ల బారిన పడి వన్యప్రాణి సంతతి రోజురోజుకీ అంతరించిపోతున్నా సంబందిత అటవీశాఖ సిబ్బంది “ మాకెందుకులే ” అన్నట్లుగా వ్యవహరించడంపట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
సంరక్షణ చట్టాలున్నా….. పలితం సున్నా !
అడవుల్లో సంచరించే వన్యప్రాణులను సంరక్షించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని రూపొందించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను వేటాడే వ్యక్తులకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు 5 వేల జరిమానా విదిస్తారు. కానీ వన్యప్రాణి సంరక్షణ చట్టం జిల్లాలో ఎక్కడా సంపూర్ణంగా అమలు కావడం లేదు. వన్యప్రాణులను సంరక్షించడం కోసం ప్రభుత్వం అటవీ శాఖతో పాటు వన్యప్రాణి విబాగం శాఖను ఏర్పాటు చేసింది. కానీ వన్యప్రాణి విబాగం అదికారులు ,సిబ్బంది పూర్తి స్థాయిలో లేకపోవడంతో వన్య ప్రాణుల వేటను అరికట్టలేక పోతున్నారు. విదుల్లో ఉన్న సిబ్బంది సైతం వన్యప్రాణుల వేటను నిరోదించడంలో పూర్తిగా విపలమ వుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
అటవీశాఖ అదికారుల నిఘా వైపల్యమే కారణమా?
అడవులలో రాత్రివేళల్లో తిరుగుతే నాటుతుపాకులు, వలల సహాయంతో వన్య ప్రాణుల వేట యదేఛ్చగా కొనసాగుతుండడానికి సంబందిత అటవీశాఖ అదికారుల వైఫల్యమే కారణమనీ పలువురు వన్యప్రాణుల అబిమానులు ఆరోపిస్తున్నారు. అడవుల అబివృద్దికి ,వన్యప్రాణుల సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా లక్షలాది రూపాయలను కేటాయిస్తున్నా ఆశించిన మేర పలితాలు కన్పించడం లేదు. అడవులలో కలప స్మగ్లింగ్,వన్యప్రాణుల వేటను నిరోదించడం కోసం అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఈ క్రమంలో బేస్‌క్యాంప్, స్ట్రైకింగ్ పోర్స్ పేరిట అటవీశాఖ అదికారులు సిబ్బందిని నియమించారు. వీరికి నెలనెల వేలల్లో వేతనాలు చెల్లిస్తున్నారు, వీరు రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వన్యప్రాణుల వేటను, కలప స్మగ్లింగ్‌ను అరికట్టాల్సి ఉంది. కానీ వన్యప్రాణుల వేటను నిరోదించడంలో అటవీశాఖ, వన్యప్రాణి విబాగం అదికారులు,బేస్‌క్యాంపు, స్ట్రైకింగ్ పోర్స్ సిబ్బంది పూర్తిగా విఫలమవుతున్నారనీ బొప్పాస్‌పల్లి సంఘటన నిరూపిస్తోంది. గ్రామాలలో స్థానికంగా ఉండాల్సిన కొందరు అటవీ సిబ్బంది, అదికారులు పట్టణ ప్రాంతాలకు పరిమితం కావడంతో “వేట” యదేఛ్చగా సాగుతోంది. అటవీ సిబ్బంది స్థానికంగా ఉండడం కోసం ఆయా గ్రామాలలో ,మండల కేంద్రాలలో క్వార్టర్లను ప్రభుత్వుం ఏర్పాటు చేసింది. లింగంపేట మండల కేంద్రంలో డిప్యూటీ రేంజ్ అదికారి నివాసం ఉండడం కోసం నిర్మించిన క్వార్టర్ గత 10 నెలలుగా వృదాగా ఉంటోంది. ఇకనైనా సంబందిత అటవీశాఖ ఉన్నతాదికారులు వన్యప్రాణుల వేటను పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Stories: