వన్డే సిరీస్ ఇంగ్లాండ్ కైవసం

లీడ్స్: భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఇంగ్లండ్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 44.3 ఓవర్లలో 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 260 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో 2-1తో వన్డే సిరీస్ ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. కెప్టెన్ మోర్గాన్(88 నాటౌట్), జోయ్ రూట్(100 నాటౌట్) ఇద్దరు కలిసి భారత […]

లీడ్స్: భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఇంగ్లండ్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 44.3 ఓవర్లలో 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 260 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో 2-1తో వన్డే సిరీస్ ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. కెప్టెన్ మోర్గాన్(88 నాటౌట్), జోయ్ రూట్(100 నాటౌట్) ఇద్దరు కలిసి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించారు.  ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జేమ్స్ విన్స్, జానీ బైర్‌స్టో కళ్లు చెదిరే శుభారంభాన్ని అందించారు. చెలరేగి ఆడిన బైర్‌స్టో 13 బంతుల్లోనే ఏడు ఫోర్లతో 30 పరుగులు చేశాడు. అయితే అతన్ని శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. మరోవైపు విన్స్ ఐదు ఫోర్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు.
రోహిత్ విఫలం..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బతగిలింది. ఫాంలో ఉన్న స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ వరుసగా రెండో మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. 18 బంతులు ఎదుర్కొన్న రాహుల్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లు మార్క్‌వుడ్, డేవిడ్ విల్లేలు అద్భుత బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ప్రారంభంలో పరుగుల కోసం భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు. డేవిడ్ విల్లేకు ఈ వికెట్ దక్కింది.

ఆదుకున్న కోహ్లి, ధావన్
తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు. ఇద్దరు వేగాన్ని పెంచడంతో స్కోరులో కదలిక వచ్చింది. ధావన్ ఎదురుదాడికి దిగుతూ వరుస ఫోర్లతో అలరించాడు. కోహ్లి కూడా తన మార్క్ షాట్లతో చెలరేగి పోయాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో స్కోరు వేగం పడిపోకుండా చూశారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇటు ధావన్, అటు కోహ్లి ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ఇదే క్రమంలో విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వన్డేల్లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కాగా, కుదురుగా ఆడుతున్న శిఖర్ ధావన్‌ను స్టోక్స్ రనౌట్ చేశాడు. దీంతో 71 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ధాటిగ ఆడిన ధావన్ 49 బంతుల్లో ఏడు ఫోర్లతో 44 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్ దూకుడుగా ఆడాడు. కోహ్లితో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే 22 బంతుల్లో మూడు ఫోర్లతో 21 పరుగులు చేసిన కార్తీక్‌ను ఆదిల్ రషీద్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి 72 బంతుల్లో 8 ఫోర్లతో 71 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా రషీద్‌కే దక్కింది. ఆ వెంటనే సురేశ్ రైనా (1) కూడా పెవిలియన్ చేరాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ ఆటగాడు నిరాశ పరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా వికెట్ కీపర్ మహేంద సింగ్ ధోని పోరాటం కొనసాగించాడు. హార్దిక్ పాండ్యతో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచేందుకు ప్రయత్నించారు. అయితే రెండు ఫోర్లతో 21 పరుగులు చేసిన హార్దిక్‌ను మార్క్‌వుడ్ వెనక్కి పంపాడు. సమన్వయంతో ఆడిన ధోని 66 బంతుల్లో 4 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్ (21), శార్దూల్ ఠాకూర్ 22 (నాటౌట్) కాస్త రాణించడంతో భారత్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 256 పరుగులకు చేరింది. కాగా, ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే, ఆదిల్ రషీద్ మూడేసి వికెట్లు పడగొట్టారు.

విరాట్ కోహ్లి అరుదైన రికార్డు

లీడ్స్: రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. వన్డే క్రికెట్‌లో అ త్యంత వేగంగా 3వేల పరుగులను సాధించిన కెప్టెన్‌గా కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో మంగళవారం జ రిగిన మూడో వన్డేలో కోహ్లి ఈ రికార్డు సాధించాడు. కోహ్లి 49 ఇన్నింగ్స్‌లలోనే 3వేల పరుగులను సాధించి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా కొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలో ఎబి.డివిలియర్స్ పేరటి ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. డివిలియర్స్ 60 ఇన్నింగ్స్‌లలో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కోహ్లి మాత్రం 49 ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డును సాధించాడు. ఇతర కెప్టెన్లలో ధోని (7౦), సౌరవ్ గంగూలీ (74), గ్రేమి స్మిత్ (83) ఇ న్నింగ్స్‌లలో మూడు వేల పరుగుల మైలురాయికి చేరుకున్నారు. కోహ్లి మాత్రం 49 ఇ న్నింగ్స్‌లలోనే దీన్ని సాధించడం విశేషం.

Related Stories: