వనపర్తిలో కార్డెన్ సెర్చ్

Police Cordon Search Operation in Wanaparthy District
అమరచింత : శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని డిఎస్‌పి సృజన అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దళిత బిఎల్‌ఎఫ్ నాయకులు తిమ్మోచిని అవమానించిన బిజెవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మేర్వరాజుపై వచ్చిన ఫిర్యాదుపై న్యాయ విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కమీషనర్ పాండునాయక్, మున్సిపల్ సిబ్బంది, ఫిర్యాదు దారులతో విచారణ జరిపారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని డిఎస్‌పి తెలిపారు. శాంతిభద్రతలు కాపాడేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. షీటీమ్స్, ఫ్రెండ్లిపోలీస్ విధానం, కమాండెంట్ విధానం, కార్డెన్ సర్చులను నిర్వహించి చోరికి గురైన వాహనదారులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శంకర్, ఎస్‌ఐ.రామస్వామి, ఎఎస్‌ఐ లక్ష్మయ్య , పోలీసులు పాల్గొన్నారు.

Comments

comments