వనపర్తిని హరిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

అడవులను 33 శాతానికి పెంచడమే ధ్యేయం హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి 4వ విడత హరితహారాన్ని విజయవంతం చేద్దాం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40వేలకు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి ప్రతి విద్యార్థి రెండు మొక్కలు నాటి పాఠశాలను హరిత పాఠశాలగా మార్చాలి కలెక్టర్ శ్వేతామహంతి మన తెలంగాణ/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం తెలంగాణను హరితహారం తెలంగాణగా మార్చేందుకు, అడవుల శాతాన్ని పెంచేందుకు 4వ విడత […]

అడవులను 33 శాతానికి పెంచడమే ధ్యేయం
హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
4వ విడత హరితహారాన్ని విజయవంతం చేద్దాం
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40వేలకు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి
ప్రతి విద్యార్థి రెండు మొక్కలు నాటి పాఠశాలను హరిత పాఠశాలగా మార్చాలి
కలెక్టర్ శ్వేతామహంతి

మన తెలంగాణ/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం తెలంగాణను హరితహారం తెలంగాణగా మార్చేందుకు, అడవుల శాతాన్ని పెంచేందుకు 4వ విడత హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని 4వ విడత హరితహారాన్ని విజయవంతం చేయాలని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40వేలకు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, ప్రతి విద్యార్థి రెండు మొక్కలు నాటి పాఠశాలను హరి త పాఠశాలగా మార్చాలని,వనపర్తి జిల్లాను హరిత జిల్లాగా మార్చడమే తమ లక్షమని కలెక్టర్ శ్వేతమహంతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అం త్యంత ప్రాధాన్యత గల సంక్షేమ పథ కాల్లో హరితహారం ఒకటి ఇప్పటికే మూడు విడతలుగా నాటిన మొక్కలు ఎదుగుదలకు వచ్చాయని కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. సోమవారం వనపర్తి పట్టణ సమీపంలో గల మర్రికుంట గ్రామంలో హరితహారం నాల్గవ విడత కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతమహంతి మాట్లాడుతూ హరితహారం విజయవంతం చేసేందుకు ప్రత్యేకాధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ లో 25 శాఖలు హరితహారం లో భాగంగా మొక్కలు నాటేందుకు నర్సరీలు సిద్దంగా ఉన్నాయి. ఒక గ్రామ పంచాయతీలో 40 వేల మొక్కలు నాటడమే లక్షంగా గ్రామ పంచాయ తీ అధికారులు కృషి చేస్తున్నారు. విద్యాశాఖ, డిఆర్‌డిఎ, డ్వామా, మొదలైన శాఖలు తమ పరిధిలో మొక్కలు నాటడం, ప్రభుత్వ ,ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటుతున్నారు. సంరక్షణ చర్యలు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నాటిన ప్రతి మొక్కకు సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. తెలంగాణకు హరిత హారంలో భాగంగా33 శాతానికి అడవుల శాతాన్ని పెంచాలనే లక్షంగా హరిత హారం విజయవంతం చేసేందుకు కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ శాఖలు, ప్రజలు, స్వచ్ఛంధంగా మొక్కలు నాటేందుకు హరితహారంలో పాల్గొనాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. 4వ విడత హరిత హారాన్నిప్రభుత్వ లక్షం చేరుకునే విధంగా కృషి చేయాలన్నా రు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్క లు నాటా లని తెలిపారు. హరిత హారానికి ప్రజలు సిద్దం కావాలని కోరారు. ఇప్పటికే మండలాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. హరిత హారంలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.

Comments

comments

Related Stories: