వచ్చే నెలలో నీళ్ల పండుగలు

Water festivals in the coming month

ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/సిరిసిల్ల: దేశానికే ఆ దర్శంగా నిలిచిన మంచినీటి సరఫరా పథకంగా మిషన్ భగీరథ పథకానికి ప్రముఖుల ప్రశంసలు అందుతున్నాయని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్లలో నిర్వహించిన మిషన్‌భగీరథ, హరితహరం స మీక్షా సమావేశంలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులు జూలై నెలాఖరులోగా పూర్తి చేసి ఆగస్ట్ 15నాటికి ప్రజలకు గోదావరి జలాలను శుద్ధ జలంగా తాగడా నికి అందించాలని అధికారులకు సూచించారు. 20 సంవత్సరాలక్రితం సిద్దిపేట ఎంఎల్‌ఎగా కెసిఆర్ ఉన్పప్పుడు దేశంలో ఎ క్కడా లేని విధంగా సిద్దిపేటకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నలోయర్ మానేరు డ్యాం నుండి నీటిని తరలించి ఇంటింటికి న ల్లాల ద్వారా నీటిని అందించారని వివరించారు. మిషన్ భగీరథను మూడేళ్లలో పూర్తి చేసిన తరువాత మిషన్ భగీరథ ద్వారా పల్లెపల్లెకు, పట్టణాలకు, తండాలకు, గూడాలకు చెందిన ఇం టింటికి నల్లాల ద్వారా గోదావరి జలాలను అ ందించడమే కెసిఆర్ లక్షమని, ఇంటింటికి నీ రందిస్తేనే ఓట్లు అడుగుతానన్న ఆయన చిత్తశుధ్ధిని అర్ధం చేసుకోవాలన్నారు. ఆగస్టు నెలలో గ్రా మగ్రామాన నీళ్ల పండుగలు నిర్వహించాలని ప్రభు త్వ అధికారులకు సూచించారు.
ఇంటింటికి శుద్ధ జలం అందితే సగం రోగాలు రావని, దానివల్ల ఆరోగ్యశాఖకు కేటాయించే నిధులూ తగ్గుతాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో టె స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, సెస్ చైర్మన్ డి లకా్ష్మరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సా మల పావని, జడ్‌పిటిసి తోట ఆగయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మంత్రి కేటిఆర్ ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో ఆకస్మిక పర్యటన చే సి అభివృద్ధి పనులను పరిశీలించారు.

Comments

comments