వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుంది

మన తెలంగాణ/వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుపొంది టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం 7వ వార్డు లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం 4 సంవత్సరాల్లోనే వ్యవసాయరంగా అభివృద్ధికి […]

మన తెలంగాణ/వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుపొంది టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం 7వ వార్డు లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం 4 సంవత్సరాల్లోనే వ్యవసాయరంగా అభివృద్ధికి రైతులకు ఉచిత విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పాఠశాలల  విద్యార్థులకు నాణ్యవంతమైన భోజనం, ఉచిత దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం హర్ష నీయమన్నారు. మహిళలకు ఒంటరి మహిళా పెన్షన్లు రూ. 1000 అందజేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రైతుబీమా, రైతుబంధు అమలుపై మండల రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న రైతుల బతుకులకు సిఎం కెసిఆర్ భరోసా కల్పించారన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం సిఎం కెసిఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తుందన్నారు. బిసి, మైనార్టీ కళాశాలలు, పాఠశాలలను స్థాపించడం తెలంగాణ ధ్యేయమన్నారు. అనంతరం 4,5,6,7, వార్డుల కాలనీవాసులతో కలిసి వార్డులోని పలు కాలనీలో నాయకులతో కలిసి నిరంజన్‌రెడ్డి టిఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు, 2019లో సార్వత్రిక  ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 560 డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు అయ్యాయని, మరో విడత 1500  ఇండ్ల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 75 మంది టిడిపి, కాంగ్రెస్ అఖిల పక్షం నాయకులు సోమవారం నిరంజన్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తల నుద్దేశించి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు నాణ్యవంతమైన భోజనం, ఉచిత దుస్తులు, ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం హర్షనీయమన్నారు. రైతుబీమా, రైతుబంధు అమలుపై మండల రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న వారి బతుకులకు సిఎం కెసిఆర్ భరోసా కల్పించారన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం సిఎం కెసిఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తుందన్నారు. బిసి, మైనార్టీ కళాశాలలు, పాఠశాలలను స్థాపించడం తెలంగాణ ధ్యేయమన్నారు. అనంతరం వార్డులోని పలు కాలనీలో నాయకులతో కలిసి నిరంజన్‌రెడ్డి టిఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్,టిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షులు గట్టుయాదవ్, కౌన్సిలర్లు వాకిటి శ్రీధర్,పాకనాటి కృష్ణ, పి.డి.కమలమ్మ, ఇందిరమ్మ, ప్రమీల,టిఆర్‌ఎస్ నాయకులు పి.డి. జయానందం, రాము, నారాయణ్ దాస్ కిట్టు, అస్లాం, అజ్జుబాయి. మురళీసాగర్, రాము, నర సింహ్మ, విష్ణుసాగర్, మహేష్, జహంగీర్, యుగంధర్‌రెడ్డి, రవిశాస్త్రి, స్వామి, ప్రశాంత్,చంద్రయ్య, కృష్ణ, జాన్, రాజు, రాము. టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: