లైవ్ షోలో మొసలి నోట్లో చేయిపెట్టాడు.. (వైరల్ వీడియో)

Crocodile bites off a trainer's arm in the middle of a show

బ్యాంకాక్: ఓ జంతు ప్రదర్శనశాలలో జంతువులకు శిక్షణ ఇచ్చే ట్రైనర్‌పై మొసలి దాడి చేసిన ఘటన చియాంగ్ రాయ్‌లోని ప్రముఖ ఫొఖాతర క్రొకోడైల్ ఫామ్ అండ్ జూలో జరిగింది. ప్రమాదం నుంచి అతడు తృటిలో తప్పించుకున్నాడు. ఈ జంతు ప్రదర్శనశాలలో మొసళ్లను చూడడానికి వచ్చిన వీక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిబ్బంది వాటితో లైవ్ షోలను ప్రదర్శిస్తారు. ఇందులో భాగంగానే ఒక ట్రైనర్ మొసలి నోట్లో చేయి పెట్టారు. అంతటితో అగకుండా దాని గొంతు లోపలి వరకు తన చేయి పెట్టి సందర్శకుల వైపు చూస్తున్నాడు. అంతే… అప్పటి వరకు కదలకుండా సైలెంట్ గా ఉన్న మొసలి కాస్త ఒక్కసారిగా ఆ ట్రైనర్ చేతిని నోటితో పట్టేసింది. చేతిని నోటితో గట్టిగా పట్టుకొని తినడానికి ప్రయత్నించగా ట్రైనర్ భయంతో తప్పించుకొని దూరంగా పారిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన సందర్శకులు భయంతో వణికిపోయారు. ఈ సంఘటనను అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తన స్మార్ట్ ఫోన్ లో బంధిచాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.