లైక్‌ల పిచ్చి చాలా ప్రమాదం…

ప్రస్తుతం చాలా వరకు ఇప్పటి తరం మనుషులు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్ర పోయేవరకు సోషల్ మీడియా లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో ఏదో ఒక పోస్ట్ పెట్టి వాటికి వచ్చే లైక్స్, కామెంట్స్ కోసం ఎదురుచూడటం కామన్ అయిపోయింది. మనుషులు స్మార్ట్ ఫోన్ లేకుంటే ఉండలేనంత పిచ్చిగా తయారవుతున్నారు. అర్ధరాత్రి వరకు కూడా సోషల్ మీడియాలో అదే పనిగా ఉంటున్న వాళ్ళు వున్నారు. యువత సోషల్ మీడియాలో […]

ప్రస్తుతం చాలా వరకు ఇప్పటి తరం మనుషులు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్ర పోయేవరకు సోషల్ మీడియా లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో ఏదో ఒక పోస్ట్ పెట్టి వాటికి వచ్చే లైక్స్, కామెంట్స్ కోసం ఎదురుచూడటం కామన్ అయిపోయింది. మనుషులు స్మార్ట్ ఫోన్ లేకుంటే ఉండలేనంత పిచ్చిగా తయారవుతున్నారు. అర్ధరాత్రి వరకు కూడా సోషల్ మీడియాలో అదే పనిగా ఉంటున్న వాళ్ళు వున్నారు. యువత సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లకు లైక్ ల కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఈ పిచ్చి చాలా హానికరమని సోషల్ మీడియా పై జరుగుతున్న అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి.

ఉదయం లేస్తూనే గుడ్ మార్నింగ్ తో మొదలు..గుడ్ నైట్ వరకు అనేక రకాల పోస్టులతో ఆకట్టుకోవాలని చూస్తారు సోషల్ మీడియాలోనే కాలం గడిపే నెటిజన్లు. రానురాను ఈ లైకుల వ్యవహారం సూసైడ్ వరకు దారితీస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. సోషల్ మీడియాలో లైకుల కోసం యుక్త వయస్కులు తమను తాము గాయపర్చుకునే పద్ధతి ఆందోళనకర రీతిలో పెరుగుతోందని అధ్యయనంలో గుర్తించారు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా వుండే వాళ్ళు తమ పోస్ట్‌లకు కామెంట్స్, లైక్స్ రాకపోతే అడిగి మరీ పెట్టించుకునే సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఇలా సోషల్ మీడియా ఒక అడిక్షన్ లా మానవ జీవితాలతో ఆడుకుంటుంది. టెక్నాలజీ దూరాలను దగ్గర చేసిందని భావిస్తున్న తరుణంలో అదే టెక్నాలజీ దగ్గర వాళ్ళను దూరం చేసి 24 గంటలు సోషల్ మీడియాలో ఉండిపోయేలా పిచ్చి వాళ్ళను చేస్తుంది. కాబట్టి సోషల్ మీడియాను ఉపయోగిచుకోవటం మంచిదే కాని మరీ అతి పనికి రాదు. కాబట్టి నిఫా లాంటి వైరస్ కంటే ప్రమాదకరమైన సోషల్ మీడియా అనే వైరస్‌కు సాధ్యమైనంత దూరం గా వుండండి.