లేడీ గూఢచారి శోభితపై మహేష్ ఫ్యాన్స్ గరం…

ఫిలింనగర్: ఇటీవలే తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న’గూఢచారి’ సినిమాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నసంగతి తెలిసిందే. అయితే గూఢచారి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు  చూసాడట. అదికాస్త ఆయనకు బాగా నచ్చడంతో హీరో అడవి శేష్ తో పాటు చిత్ర యూనిట్ ను అభినందిస్తూ ట్వీట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించాడు. కాగా… సూపర్ స్టార్ పెట్టిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ హీరోయిన్ శోభిత ‘థ్యాంక్ యూ’ అని చెప్పింది. అంతే.. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనయ్యారు. […]

ఫిలింనగర్: ఇటీవలే తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న’గూఢచారి’ సినిమాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నసంగతి తెలిసిందే. అయితే గూఢచారి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు  చూసాడట. అదికాస్త ఆయనకు బాగా నచ్చడంతో హీరో అడవి శేష్ తో పాటు చిత్ర యూనిట్ ను అభినందిస్తూ ట్వీట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించాడు. కాగా… సూపర్ స్టార్ పెట్టిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ హీరోయిన్ శోభిత ‘థ్యాంక్ యూ’ అని చెప్పింది. అంతే.. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనయ్యారు. థ్యాంక్స్ అట్లా చెప్తారా..? రెస్పెక్ట్ ఎక్కడ..? అంటూ సోషల్ మీడియా ద్వారా శోభితపై దాడికి దిగారు. వాళ్ళు చెప్పేదేంటంటే మహేష్ బాబు సర్ అనో… మహేష్ బాబు గారు అనో…  లేదా సూపర్ స్టార్ అనో…  థ్యాంక్ యూ చెప్పాలంటున్నారు. మరి శోభిత ధూళిపాళ కర్టసీ తో ‘థ్యాంక్ యూ’ చెప్పడం కూడా మహేష్ బాబును గౌరవించినట్టే అవుతుంది కదా.! అయితే మహేష్ వీరాభిమానులు ఎందుకు దీన్ని గమనించడం లేదో.?  కారణం ఏదేమైనప్పటికీ ఇంకా ఈ ట్రోలింగ్ కొనసాగుతోంది.

Related Stories: