లిఫ్టు మంజూరు కోసం మంత్రి హరీష్‌రావును కలిసిన రైతులు

మఠంపల్లి ః సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలంలో చౌటపల్లి, బక్కమంతులగూడెం రైతులకు కృష్ణానదిపై లిఫ్టు మంజూరు చేయాలంటూ హుజూర్‌నగర్ నియోజకవర్గ టిఆర్‌యస్ ఇంచార్జి కాసోజు శంకరమ్మ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల రైతులు గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరీష్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతు ఎన్‌యస్‌పి కాలువకు చివరి భూములు కావడంతో మండలంలోని చౌటపల్లి, బక్కమంతులగూడెం, మండల కేంద్రంలోని సుమారు 3వేల ఎకరాలు సాగు నీరు […]


మఠంపల్లి ః సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలంలో చౌటపల్లి, బక్కమంతులగూడెం రైతులకు కృష్ణానదిపై లిఫ్టు మంజూరు చేయాలంటూ హుజూర్‌నగర్ నియోజకవర్గ టిఆర్‌యస్ ఇంచార్జి కాసోజు శంకరమ్మ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల రైతులు గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరీష్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతు ఎన్‌యస్‌పి కాలువకు చివరి భూములు కావడంతో మండలంలోని చౌటపల్లి, బక్కమంతులగూడెం, మండల కేంద్రంలోని సుమారు 3వేల ఎకరాలు సాగు నీరు లేక బీడు భూములుగా మారాయని ఈభూములు సన్నకారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారివి అని సాగునీరు అందకపోవడంతో సుమారు 600కుటుంబాలు నిరాశ్రయులుగా మారి జీవనోపాధి కోల్పోతున్నారని అన్నారు. సమీపంలోని కృష్ణానది నుండి లిఫ్టు ఏర్పాటు చేసి బీడు భూములకు సాగులోకి వచ్చేలా చూడాలని హరీష్‌రావుకు తెలిపారు. ఈవిషయమై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Comments

comments

Related Stories: