లారీ బైక్ ఢీ: దంపతుల మృతి

Couple Dies In Road Accident In Peddapally District
పెద్దపల్లి రూరల్‌ః పాలకుర్తి మండలం బసంత్‌నగర్ టోల్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బసంత్ నగర్ జీడి నగర్‌కు చెందిన భార్యభర్తలు ఔరగంటి మల్లేష్ (60)శంకరమ్మ(55)లు కన్నాలలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ద్విచక్రం పై స్వగ్రామం కు వెళ్లే క్రమంలో టోల్ గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా ఏదురుగా వస్తున్న లారీ ఢీ కొన్నది. దీనితో మల్లేష్ లారీ క్రింద పడి అక్కడిక్కడే మృతి చెందగా, శంకరమ్మకు తీవ్రగాయాలు కావటంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయలు కావటంతో ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందింది. బసంత్‌నగర్ ఎస్సై రాజ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments