హయత్నగర్ : రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొని మృతి చెందిన సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిదిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తుర్కయంజాల్ మున్సిపాలిటి తొర్రూర్ గ్రామానికి చెందిన వరకాల భిక్షపతి(59) కూలీ పని చేసుకుంటూ జీవిస్తుంటాడు. శనివారం ఉదయం హయత్నగర్ కుంట్లూర్ చౌరస్తాలో నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ(ఏపి24టిబి3249) ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.