లారీ ఢీకొని వ్యక్తి మృతి

A Man dies in Lorry Hit
చిన్నశంకరంపేట : లారీ టీవిఎస్ ఎక్సెల్ను ఢీ కొట్టడంతో ఒకరి మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండల పరిధిలోని గవ్వలపల్లి చౌరస్తాలో సోమవారము చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామానికి చెందిన పాపయ్య(52) గవ్వలపల్లి చౌరస్తా నుండి మడూరు వైపు టీవిఎస్ ఎక్సెల్ పై వెళ్తుండగా శంకరంపేట నుండి మెదక్‌కు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య గోపమ్మ ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పాపయ్యకు భార్య గోపమ్మతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపారు.

The post లారీ ఢీకొని వ్యక్తి మృతి appeared first on .