లారీ ఢీకొని మూడు గేదెలు మృత్యువాత

Three Buffelows Dies In Road Accident In Vanaparthy Dist

వనపర్తి రూరల్: వనపర్తి మండల పరిధిలోని చిమన గుంటపల్లి గ్రామ శివారులో మంగళ వారం మూడు గేదెలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకొంది. రూరల్ ఎస్‌ఐ .రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిమన గుంటపల్లి గ్రామానికి చెందిన రైతు మోహన్ తన 4 గేదెలను ఉదయం 7 గంటలకు ఇంటి దగ్గర నుండి తన వ్యవసాయ పొలానికి తీసుకెళ్తుండగా రోడ్డు దాటే సమయంలో వనపర్తి నుండి అచ్చంపేట కు వెళ్తున్నలారీ ఢీకొట్టింది. లారీ  నెంబర్ ఎపి 03 సిఈ 0699 అనే లారీ కూరగాయల లోడ్‌తో వనపర్తి నుండి అచ్చేంపేటకు  వెళ్తుంది.  ఈ ప్రమాదంలో  3 గేదెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ. రాఘవేందర్‌రెడ్డి తెలిపారు.  గేదెల విలువ రూ. లక్ష రూపాయలు ఉంటుందని,ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని మోహన్  కొరారు.

Comments

comments