లారీని ఢీకొట్టిన బస్సు: ఒకరి మృతి

Road-Accident

మంచిర్యాల: అజ్మీర్ యాత్రకు వెళ్లే బస్సు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన మంచిర్యాల జిల్లాలోని తాడూరులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యాత్రికుల బృందంతో వెళుతున్నబస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.