లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

Today stock market is profitable

ముంబయి: సోమవారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళా మళ్లీ లాభాల బాట పట్టాయి. టర్కీలో ఆర్థిక మాంద్యం వల్ల మన రూపాయి విలువ పతనమైనప్పటికీ… దాని ప్రభావం దేశీయ మార్కెట్ల మీద పడలేదు. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 207 పాయింట్లు పెరిగి 37,852కు లాభపడింది. నిఫ్టీ 79 పాయింట్లు పుంజుకుని 11,435కు చేరింది.

హెచ్ డి ఐఎల్ 11.59% బాల్ క్రిష్ణ ఇండస్ట్రీస్ 8.75% ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటెయిల్ 7.95% వాటెక్ వాబాగ్ లిమిటెడ్ 7.27% టిఐ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 7.07% ఉంది. బిఎస్ఈ సెన్సెక్స్ టాప్ లో ఉన్నాయి. వక్రాంగీ (-16.25%), అలహాబాద్ బ్యాంక్ (-6.32%), రెడింగ్టన్ ఇండియా లిమిటెడ్ (-5.89%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ (-5.00%), చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (-4.40%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Comments

comments