లవ్ మ్యారెజే చేసుకుంటా…

హైదరాబాద్: తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ‘గీత గోవిందం’ సిన్మా తెరకెక్కింది. రెండు రాష్ట్రాలతో పాటు ఈ చిత్రం ఓవర్సీస్ లోను భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో దేవరకొండకు… లవ్ మ్యారెజ్ చేసుకుంటారా..? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా…?’ అనే ప్రశ్న ఎదురైంది. అందుకు స్పందించిన ఆయన ఒకప్పుడు నేను 40 సంవత్సరాలకి పెండ్లి చేసుకోవాలని అనుకున్నాను… కానీ ఇప్పుడు దానిని 35కి తీసుకొచ్చేశానని చెప్పాడు. ఇక ఎప్పటికైనా ప్రేమపెళ్లే చేసుకుంటా. […]

హైదరాబాద్: తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ‘గీత గోవిందం’ సిన్మా తెరకెక్కింది. రెండు రాష్ట్రాలతో పాటు ఈ చిత్రం ఓవర్సీస్ లోను భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో దేవరకొండకు… లవ్ మ్యారెజ్ చేసుకుంటారా..? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా…?’ అనే ప్రశ్న ఎదురైంది. అందుకు స్పందించిన ఆయన ఒకప్పుడు నేను 40 సంవత్సరాలకి పెండ్లి చేసుకోవాలని అనుకున్నాను… కానీ ఇప్పుడు దానిని 35కి తీసుకొచ్చేశానని చెప్పాడు. ఇక ఎప్పటికైనా ప్రేమపెళ్లే చేసుకుంటా. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదని చెప్పుకొచ్చాడు. తెలంగాణ అమ్మాయినే చేసుకోవాలి, ఆంధ్ర అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనేం మాత్రం తనకు లేదన్నాడు. ప్రపంచంలో ఎక్కడ వున్నా తనకు కనెక్ట్ కాగలిగితే చాలని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. ఇంతవరకూ తనకు నచ్చిన అమ్మాయైతే కనబడలేదని దేవరకొండ చెప్పుకొచ్చాడు.

Comments

comments

Related Stories: