లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

EE-MAYA-PEREMITO

సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. కావ్యాథాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రాము కొ ప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ నిర్మించారు. లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో గ్లోబెల్ సినిమాస్, ఆంధ్రాలో గీతా ఆర్ట్ పంపిణీ చేయనున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దివ్యా విజయ్ మాట్లాడుతూ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు లవ్, కామెడీ ఎలిమెంట్స్ సహా అన్ని అంశాలతో దర్శకుడు రాము ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మా చిత్రాన్ని ఆంధ్రాలో గీతా ఆర్ట్, నైజాంలో గ్లోబల్ సినిమాస్ సంస్థలు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈనెల నాలుగో వారంలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం”అని అన్నారు. రాజేంద్ర ప్రసాద్, మురళీశర్మ, రాళ్లపల్లి, ఈశ్వరీరావు, పవిత్రా లోకేష్, సత్యం రాజేష్ ప్రధాన తారా గణంగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః శ్యామ్ కె.నాయుడు, సంగీతంః మణిశర్మ, ఫైట్స్ : విజయ్, ఎడిటర్ : నవీన్ నూలి.