లయన్స్‌క్లబ్‌లు సామాజిక సేవలో ముందుండాలి…

సుల్తానాబాద్: లయన్స్‌క్లబ్‌లు సామాజిక సేవలతో పాటు అన్ని రంగాలలో సహయ సహకారాలను పేద ప్రజలకు అందించాలని లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ ఫస్ట్ గవర్నర్ డాక్టర్ రేకులపల్లి విజయ అన్నారు. సుల్తానాబాద్ లయన్స్‌క్లబ్ నూతన కార్యావర్గం ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది. లయన్స్‌క్లబ్ బాధ్యతలను ధీకొండ భూమేష్ నుండి కొమురవెళ్లి చక్రదర్ అధ్యక్ష బాధ్యతలను తీసుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ మాట్లాడుతూ సామాజిక సేవలతో పాటు హరితహారంలో మొక్కలునాటడం, వికలాంగులకు పరికరాలు ఇవ్వడంతో […]

సుల్తానాబాద్: లయన్స్‌క్లబ్‌లు సామాజిక సేవలతో పాటు అన్ని రంగాలలో సహయ సహకారాలను పేద ప్రజలకు అందించాలని లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ ఫస్ట్ గవర్నర్ డాక్టర్ రేకులపల్లి విజయ అన్నారు. సుల్తానాబాద్ లయన్స్‌క్లబ్ నూతన కార్యావర్గం ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది. లయన్స్‌క్లబ్ బాధ్యతలను ధీకొండ భూమేష్ నుండి కొమురవెళ్లి చక్రదర్ అధ్యక్ష బాధ్యతలను తీసుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ మాట్లాడుతూ సామాజిక సేవలతో పాటు హరితహారంలో మొక్కలునాటడం, వికలాంగులకు పరికరాలు ఇవ్వడంతో పాటు అనేక కార్యక్రమాలను లయన్స్‌క్లబ్‌లు నిర్వహిస్తున్నాయని అన్నారు. మరిన్ని సేవ కార్యక్రమాలను చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ డాక్టర్ టి.వెంకటేశ్వర్‌రావు, ఆర్.సి. బౌడ బాపురావు, కో ఆర్డినేటర్‌లు రేకులపల్లి విజయ్‌కుమార్, గజభీంకార్ జగన్, క్లబ్ కార్యదర్శి పోచంపెల్లి పోచమల్లు, కోశాధికారి ఎలిగేటి రమేష్‌తో పాటు లయన్స్‌క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Related Stories: