లక్షసాధనకు పట్టుదల, విశ్వాసం తోడవ్వాలి

 The opportunities offered by the youth government

మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : యువత ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చకునని తమ లక్ష్యాలను చేరుకోవడానికి పట్టుదల, విశ్వాసంతో చదివి విజయం సాధించాలని తెలంగాణ రాష్ట్ర బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ సుజాత అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌ను ఆమె ఆకస్మీకంగా తనిఖీ చేశారు. బిసి స్టడీ సర్కిల్‌లో వివిధ పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ గురించి స్టడీ సర్కిల్ డైరెక్టర్‌ను ఆరా తీశారు. గ్రూప్-4, విఆర్‌వో, పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న ఫ్యాకల్టీ బోధనా విధానాన్ని ఆమె పరిశీలించారు. విద్యార్థులకు ఏకధాటిగా ఒకే సబ్జెక్టు చెప్పడం సరికాదని, శిక్షణలో భాగంగా అవసరమైన ఇతర సబ్జెక్ట్‌లను, జికెకి సంబంధించిన విషయాలపై బోధిస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్టడీ సర్కిల్‌లో సరియైన వసతులు లేవని, కొత్తగా నిర్మిస్తున్న బిసి స్టడీ సర్కిల్  భవన నిర్మాణ పనులు సుమారు 60శాతం పూర్తయినట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా స్టడీ సర్కిళ్ల నిర్వహణ ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. నిరుద్యోగ యువత ఉపాధికి ఈ కేంద్రాలు ఉపయోగపడుతాయన్నారు. సివిల్స్‌కు సిద్ధ్దమవుతున్న వారికి శిక్షణ ఇవ్వడానికి హైరాబాద్, వరంగల్ జిల్లాలో శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మెరిట్ ప్రాతిపదికన విద్యార్థులకు ఎంపిక చేసి కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు పాల్గొన్నారు.

Comments

comments